Begin typing your search above and press return to search.

జ‌గ‌న్.. ఇద్ద‌రు చంద్రుళ్లను పిలిచిన కేంద్రం!

By:  Tupaki Desk   |   16 Jun 2019 12:19 PM GMT
జ‌గ‌న్.. ఇద్ద‌రు చంద్రుళ్లను పిలిచిన కేంద్రం!
X
పార్ల‌మెంటులోప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీల‌కు తాజాగా కేంద్రం ఒక ఆహ్వానం పంపింది. ఈ నెల 19న కేంద్రం నేతృత్వంలో ఒక ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబును కూడా పిలిచారు.

దీనికి సంబంధించిన లేఖ‌ను తాజాగా కేంద్రం పంపింది. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖామంత్రి ప్ర‌హ్లాద్ జోషి ఈ ముగ్గురు ప్ర‌ముఖుల‌కు లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల‌కు సంబంధించి ఈ ముగ్గురు ప్ర‌ముఖుల‌తో పాటు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పార్టీ అధినేత‌ల్ని ఆహ్వానించారు.

అయితే.. ఈ ఆహ్వానం అందుకున్న ప్ర‌తిఒక్క‌రూ పార్ల‌మెంటులో ఆయా పార్టీల్లో ప్రాతినిధ్యం వ‌హించే వారికి మాత్ర‌మే ఆహ్వానం అందుతుంది. ప్ర‌ధాని మోడీ నేతృత్వం వ‌హించే ఈ స‌మావేశానికి మిగిలిన రాష్ట్రాల పార్టీల అధినేత‌ల్ని ఆహ్వానిస్తున్నారు.

ఈ స‌మావేశంలో ఎజెండాగా ఐదు అంశాల్ని ఫైన‌ల్ చేశారు. పార్ల‌మెంటు ఔన‌త్యాన్ని పెంచేందుకు చ‌ర్య‌లు.. ఒక దేశం ఒకే ఎన్నిక‌లు.. 75 ఏళ్ల స్వాతంత్య్రం సంద‌ర్భంగా న‌వ భార‌త నిర్మాణం.. గాంధీ 150వ జ‌యంతి వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌తో పాటు వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి మీద చ‌ర్చ‌లు జ‌రిపేందుకు అన్నిపార్టీల అధినేత‌లు స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని కోరారు. మ‌రి.. ఈ స‌మావేశానికి ఎవ‌రెవ‌రు వెళ‌తారో? ఎవ‌రెవ‌రు డుమ్మా కొడ‌తారో చూడాలి.