Begin typing your search above and press return to search.
డ్రైవర్లపై మోడీ సర్కారు సంచలన నిర్ణయం
By: Tupaki Desk | 19 Sep 2017 7:30 AM GMTబైక్ కానీ కారు కానీ.. వాహనం ఏదైనా కానీ.. దాన్ని నడిపే వారంతా ఒకే తీరుతో వ్యవహరస్తుంటారు. చెవి దగ్గర సెల్ పెట్టుకొని ఏదో కొంపలు మునిగిపోయేంత అర్జెంట్ ఇష్యూ నడుస్తున్నట్లుగా మాట్లాడటం కనిపిస్తూ ఉంటుంది. మరికొందరు హియర్ ఫోన్స్ పెట్టుకొని కాల్ మాట్లాడుతుంటారు. మరికొన్నిసార్లు మ్యూజిక్ వింటూ రయ్యిన దూసుకెళుతుంటారు.
ఇలాంటి వాటితో అనుకోని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా మోడీ సర్కారు సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై ఎవరైనా సరే డ్రైవర్లు మ్యూజిక్ వింటే వారికి భారీ జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అధిక వేగంతో వాహనాల్ని నడిపే డ్రైవర్లకు ఐదురెట్లు అదనపు జరిమానా విధించాలని ఆదేశించారు.
అధిక వేగంతో వాహనాలు నడిపే వారినే కాదు.. పుట్ పాత్ లమీద వాహనం నడిపినా.. ఎయిర్ హారన్ వినియోగించినా భారీ జరిమానాలు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ట్రాఫిక్ నిబంధనలు పాటించని డ్రైవర్లకు గతంలో రూ.100 జరిమానా కింద వేస్తే సరిపోయేది. అయితే.. ఇప్పుడు కొత్త పథకాల్ని రూపొందించారు. దీని ప్రకారం తప్పు చేసిన డ్రవైర్ కు కనీసం మూడు నాలుగు రెట్లు ఎక్కువగా జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు.
ఇందుకు సంబంధించి చట్టబద్ధమైన మార్పులు తీసుకొచ్చేందుకు అనువుగా బిల్లును మార్చాలని భావిస్తున్నారు. తాజాగా ట్రాఫిక్ నిబంధనలపై మొదటిసారి కేంద్రం ఒక సమగ్ర పుస్తకాన్ని విడుదల చేసింది. ప్రమాదాల్లేకుండా సురక్షిత ప్రయాణమే లక్ష్యమన్నది కేంద్రం మాటగా ఉంది. మరి.. ఈ కొత్త రూల్స్ ఎంతమేర మార్పులు తెస్తాయో చూడాలి.