Begin typing your search above and press return to search.

ఏపీకి ప్ర‌త్యేక హోదా : కేంద్రం క్లారిటీ

By:  Tupaki Desk   |   31 July 2015 10:08 AM GMT
ఏపీకి ప్ర‌త్యేక హోదా : కేంద్రం క్లారిటీ
X
ఆంద్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్న సంద‌ర్భంగా ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇచ్చింది. కేంద్ర సహాయ మంత్రి ఇంద్రజిత్ సింగ్ ఈ మేర‌కు ఎన్డీయే ప్ర‌భుత్వం త‌ర‌ఫున స్పష్టత ఇచ్చారు. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ ప్రశ్న‌కు స‌మాధానం ఇస్తూ ఆయన ఏపీకి స‌హా అన్ని రాష్ర్టాల‌కు సంబంధించి ప్ర‌త్యేక హోదా అంశంపై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని స్పష్టం చేశారు.

ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాద్యం కాదని ఆయ‌న కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు. బీహారుకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామే తప్ప, ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. దీంతో పాటు మ‌రో మాట ఆయ‌న తేల్చిచెప్పారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో అనుస‌రించాల్సిన తీరుపై సంబందించి కేంద్రం వద్ద ఎలాంటి విదానం లేదని అన్నారు. ఆర్థిక సంఘం సిఫారసుల‌ తర్వాత నలభై రెండు శాతం నిదులను రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతోందని ఆయన తెలిపారు. ఆ విధంగా నిధులు కేటాయించ‌డం వ‌ల్ల ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి అన్నిరాష్ర్టాల‌కు వ‌ర్తించేలా స‌మాధానం ఇచ్చిన‌ప్ప‌టికీ ఈ స్పంద‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టానికి అత్యంత అనువ‌ర్తంగా ఉంటుంది. ఇప్ప‌టికే ఏపీలో ప్ర‌త్యేక హోదా ఆకాంక్ష పీక్ స్టేజీకి చేరిన సంగ‌తి తెలిసిందే.