Begin typing your search above and press return to search.
బంగారం మీద మరింత క్లారిటీ ఇచ్చేశారు
By: Tupaki Desk | 2 Dec 2016 7:18 AM GMTఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా.. వారి మాటల మధ్యలో బంగారం మాట వస్తోంది. పెద్దనోట్లను రద్దు చేసిన నేపథ్యంలో జనాల దగ్గరున్న బంగారం మీద కూడా ప్రధాని మోడీ కన్నుపడిందని.. ఇంట్లో ఉండే బంగారంపై ఆంక్షలకు తెర తీసినట్లు అవుతుందన్న మాట ప్రచారం అవుతోంది. ఇదే సమయంలో ప్రధాని తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొన్ని మీడియా సంస్థలు రెట్టించిన ఉత్సాహంతో చెలరేగిపోతున్నాయి.
బంగారం మీద ప్రజల్లో నెలకొన్న సందేహాలకు సమాధానాలు చెప్పు కన్నా.. వారిని మరింత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేయటం కనిపిస్తోంది. మరికొందరు బంగారం మీద ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి వేళ.. నిజం ఎంత? అబద్ధం ఎంత? ప్రశ్నగా మారింది. ప్రజలకున్న సందేహాల్ని తీర్చే విషయంలో సరైనసమాచారం ఇచ్చే కన్నా.. ఎవరికి వారు మరిన్ని సందేహాలు కలిగేలా చేయటంతో ఇప్పుడు గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పకతప్పదు.
బంగారం మీద ఉన్న సందేహాల విషయానికి వస్తే..
= పెద్ద నోట్ల రద్దు విషయంలో ఎలాంటి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారో.. అలాంటి నిర్ణయాల్ని మోడీ సర్కారు తీసుకోనుంది.
= ఇంట్లో ఉన్న బంగారానికి లెక్కలు చూపించాలి.
= తాతల కాలం నుంచి వస్తున్న బంగారాన్ని మార్చుకొని కొత్తగా చేయించుకున్న నగల్ని ఎలా లెక్కకడతారు?
= బంగారం కొనే సమయంలో రశీదులు ఉంచుకోవాలని చెబుతున్నారు. అప్పుడెప్పుడో పెళ్లిళ్ల సమయంలో ఇచ్చిన బంగారానికి ఎవరైనా రశీదులు దాచుకుంటారా?
= అయినా..సగటు జీవికి అండగా ఉంటే బంగారం మీద మోడీ పడటం ఏమిటి?
ఇలా చెప్పుకుంటే చాలానే సందేహాలు ప్రజల్నివెంటాడి వేధిస్తున్నాయి. ఇక..ఇలాంటి సందేహాలకు సమాధానాలు చెప్పటం తోపాటు.. బంగారం మీద ప్రభుత్వం ఏమనుకుంటోంది? వారి ఆలోచనలు ఏమిటి? తాజాగా సవరించిన చట్టం దేనికి సంబంధించింది? లాంటి అంశాల్ని చూస్తే..
1. తాజాగా సవరణలు చేసిన చట్టం 1961లోని ఆదాయ చట్టంలోని సెక్షన్ 115 బీని మాత్రమే మార్చారు.
2. మొన్నటివరకూ ఉన్న దాని ప్రకారం 30 శాతం పన్ను ఉండగా.. ఇప్పుడు దానికి25 శాతం సర్ ఛార్జి.. సెస్ విధించేలా సవరించారు.
3. అందరూ అపోహ పడుతున్నట్లుగా ఐటీ చట్టంలోని సెక్షన్ 69.. 69ఏ.. 69బి సెక్షన్లకు ఎలాంటి సవరణలు చేయలేదు. ఈ సెక్షన్లలో పేర్కొన్న ఆస్తుల్ని ఆదాయంగా పరిగణించటం ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ నేపథ్యంలో మార్పులు చేశారన్నది ఉత్తమాటగా చెప్పాలి.
4. తాజాగా సవరించిన ఐటీ చట్టంలో సెక్షన్ 115ఈలో కూడా ఆదాయంపై విధించాల్సిన పన్ను రేటును మాత్రమే పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
అసలు ఐటీ చట్టాన్ని ఎందుకు సవరించారు?
పెద్దనోట్ల రద్దుతో పాటు.. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్ననేపథ్యంలో.. అందుకు తగ్గట్లుగా చట్టంలో మార్పులు చేశే తప్పించి.. మొత్తంగా మార్చింది నామమాత్రమేనని చెప్పాలి. కొందరు ఆదాయపన్నును ఎగగొట్టేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వాటికి చెక్ చెప్పేందుకు చేసిన ప్రయత్నంగా చెప్పాలి.
ఇంట్లో బంగారం ఎంత ఉండాలి?
= ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్లను మార్చిన వెంటనే.. బంగారం మీద కూడా కేంద్రం కన్నేసిందని.. గుట్టుచప్పుడు కాకుండా రూల్స్ ను మార్చేసిందన్న రూమర్ భారీగా ఉంది. అయితే.. అందులో నిజం లేదని చెప్పాలి.
= అదెలానంటే.. ఒక వ్యక్తి దాదాపు కేజీ (మరింత వివరంగా చెప్పాలంటే ఒక మహిళకు 500 గ్రాములు.. పురుషుడికి 100 గ్రాములు.. పెళ్లికాని వారికి పావు కిలో బంగారం ఉండటం తప్పేం కాదు)కి పైనే బంగారం ఉన్న వారికి కొంత ఇబ్బంది. వాస్తవ దృష్టితో చూస్తే..ఇంట్లో కేజీ బంగారం వరకూ ఉండే ఇళ్లు ఎన్ని ఉంటాయి? అన్నది పెద్ద ప్రశ్న.
= ఒకవేళ తాతల నాటి నుంచి వస్తున్న బంగారం కేజీ కంటే ఎక్కువగా ఉన్నా పట్టించుకోరు. ఎందుకంటే.. ఈ బంగారానికి సంబంధించి తాజాగా చేసిన మార్పులు.. చేర్పులు ఏమీ లేవని చెప్పక తప్పదు.
= ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ.. నల్లధనంతో ఈ మధ్య కాలంలో భారీగా బంగారం కొనుగోలు చేసిన వారిపై ఐటీ శాఖ దృష్టి సారిస్తుందే తప్పంచి.. మిగిలిన వారికి ఎలాంటి సమస్య ఉండదు.
= పొదుపు ద్వారా కొనుగోలు చేసిన బంగారం కానీ.. తమ సంపాదనతో సమకూర్చుకున్న బంగారం కానీ.. వ్యవసాయం మీద వచ్చిన ఆదాయంతో కొన్న బంగారం మీదా ఎలాంటి పన్ను ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/