Begin typing your search above and press return to search.

పుట్టగానే కులాన్ని గుర్తించేస్తారంట

By:  Tupaki Desk   |   23 Nov 2015 4:14 AM GMT
పుట్టగానే కులాన్ని గుర్తించేస్తారంట
X
మతాలకు.. కులాలకు అతీతమైన సమాజాన్ని నిర్మించాలంటూ నేతలు చాలానే మాటలు చెబుతుంటారు. తాజాగా కేంద్రం తీసుకోవాలని భావిస్తున్న నిర్ణయం తీరు చూస్తే.. పుట్టిన వెంటనే.. కులం ట్యాగ్ ను కట్టేలా ఉన్నారు. పుట్టిన పిల్లలకు ఇచ్చే జనన ధ్రువీకరణ పత్రం (బర్త్ సర్టిఫికేట్)లోనే సదరు పుట్టిన పిల్లాడు లేదా పిల్ల ఏ కులానికి చెందినదన్న విషయాన్నే అందులో ఉండేలా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఎస్సీ.. ఎస్టీ చిన్నారులకు సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ లోనే వారికి సంబంధించిన కులాన్ని ధ్రువీకరించటం ద్వారా రిజర్వేషన్ కు సంబంధించిన సమస్యలు చాలావరకూ తీరిపోతాయన్న భావన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే వివిధ కార్యక్రమాలకు సంబంధించి రిజర్వేషన్ల కోసం దాఖలు చేసుకునే దరఖాస్తుల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలాంటి వాటిని అధిగమించేందుకు వీలుగా.. పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికేట్ లోనే కులాన్ని కూడా నమోదు చేసి ఇవ్వటం ద్వారా సమస్యను అథిగమించొచ్చన్న భావన వ్యక్తమవుతోంది. దీనిపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నిర్ణయం కానీ విధాననిర్ణయంగా అమలు జరిగితే మాత్రం.. బర్త్ సర్టిఫికేట్ లోనే దళిత ముద్ర స్పష్టంగా కనిపించటం ఖాయమన్నమాట.