Begin typing your search above and press return to search.

సుప్రీం సాక్షిగా ఆంధ్రోళ్ల‌కు షాకిచ్చిన జైట్లీ!

By:  Tupaki Desk   |   4 July 2018 8:06 AM GMT
సుప్రీం సాక్షిగా ఆంధ్రోళ్ల‌కు షాకిచ్చిన జైట్లీ!
X
కోరుకోని విభ‌జ‌న‌ను ఏపీ పీక‌కు చుట్టి.. రెండు ముక్క‌లు చేసేసిన యూపీఏ స‌ర్కారు..తాము చేస్తున్న ప‌నికి న‌ష్ట‌పోయే ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇచ్చి ఆదుకుంటామ‌ని పేర్కొన‌టం తెలిసిందే. నాటి ప్ర‌ధాని రాజ్య‌స‌భ‌లో త‌న‌కు తానే ప్ర‌క‌ట‌న చేస్తూ ఏపీకి తాము ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని.. ఏపీని ఆదుకుంటామ‌న్నారు. త‌ర్వాతి కాలంలో అధికారంలోకి వ‌చ్చిన మోడీ స‌ర్కారు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు సుముఖంగా లేక‌పోవ‌టం.. ఇవ్వ‌లేమ‌ని చెప్ప‌టం తెలిసిందే.

హోదా విష‌యంలో ఏపీకి మోడీ స‌ర్కారు చేయివ్వ‌టంపై ఏపీలో తీవ్ర ఆగ్ర‌హావేశాలు వ్య‌క్త‌మ‌య్యాయి. విభ‌జ‌న కార‌ణంగా దెబ్బ ప‌డిన ఏపీకి మొండిచేయి ఇచ్చేలా మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌ట‌మా? అంటూ ప‌లు విధాలుగా నిర‌స‌న‌లు.. దీక్ష‌లు చేయ‌టం తెలిసిందే.

హోదా విష‌యంలో ఇప్ప‌టికే కేంద్రం స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఏదో ఒక ఆశ ఆంధ్రోళ్ల‌కు లోప‌ల మిగిలి ఉంది. తాము కానీ అధికారంలోకి వ‌స్తే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌క‌ట‌న ఒక‌టి ప‌లువురికి ఆశ‌గా మారిన వేళ‌.. మోడీ స‌ర్కారు మ‌రో వివాదాస్ప‌ద అఫిడ‌విట్ ను దాఖ‌లు చేసింది.

ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలో ఉన్న‌వ‌న్నీ ఇచ్చామ‌ని.. ఇక ఇచ్చేదేం లేదంటూ ఒక అఫిడ‌విట్ ను దాఖ‌లు చేసింది. పొంగులేటి పిటిష‌న్ లో కౌంట‌ర్ ఆఫిడ‌విట్ ను దాఖ‌లు చేసింది. ప్ర‌త్యేక హోదాను ఇవ్వ‌లేమ‌ని అధికారికంగా కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పేసింది.

రాజ్య‌స‌భ‌లో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఇచ్చిన హామీని అమ‌లు చేయ‌లేమ‌ని కోర్టుకు కేంద్రం చెప్పేసింది. విభ‌జ‌న హామీల‌న్నీ తీర్చేసిన‌ట్లుగా చెబుతున్న కేంద్రం.. విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన రైల్వే జోన్ హామీ ప్ర‌స్తావ‌న తేవ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

ఇంత‌కీ ఈ అఫిడ‌విట్ కేంద్రం సుప్రీంకోర్టులో ఎందుకు దాఖ‌లు చేసింద‌న్న‌ది చూస్తే.. .విభ‌జ‌న హామీల అమ‌లుపై కేంద్రం త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేయాల‌ని.. పోల‌వ‌రం ముంపుపై అధ్య‌య‌నం.. బ‌య్యారం స్టీల్ ఫ్లాంట్ విష‌యంతో పాటు విభ‌జ‌న సంద‌ర్భంగా ఏపీకి ఇచ్చిన హామీల అమ‌లు కోసం కేంద్రాన్ని ఆదేశించాల్సిందిగా పొంగులేని సుధాక‌ర్ రెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో కేంద్రం వైఖ‌రిని తెలియజేసేందుకు కౌంట‌ర్ దాఖ‌లు చేయాలని సుప్రీం కోరింది. ఈ నేప‌థ్యంలో అఫిడ‌విట్ దాఖ‌లు చేసిన కేంద్రం ఏమేం పేర్కొందంటే..

+ దుగ్గ‌రాజు ప‌ట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ సూత్ర‌ప్రాయంగా అంగీకారం అంటూనే.. సాధ్యాసాధ్యాల‌పై అధ్య‌య‌నం అంటూ మెలిక పెట్టారు

+ విభ‌జ‌న జ‌రిగిన ఏడాది ఏపీ రెవెన్యూ లోటు రూ.4116 కోట్లు మాత్ర‌మే

+ ఇప్ప‌టివ‌ర‌కూ రూ.3979 కోట్లు ఇచ్చాం

+ రాజ‌ధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు ఇచ్చాం

+ యూసీలు ఇచ్చాక మ‌రో మూడేళ్ల‌లో ఏడాదికి రూ.330 కోట్ల చొప్పున వెయ్యి కోట్ల రూపాయిలు ఇస్తామ‌న్న‌హామీ