Begin typing your search above and press return to search.
దేశంలో ఇక నాలుగైదు బ్యాంకులే..
By: Tupaki Desk | 16 Jun 2017 6:19 AM GMTఊరికో బ్యాంకు, వీధికో బ్యాంకు.. ఒక్కోదానికి ఒక్కో పేరు. కానీ... వీటన్నిటినీ తగ్గించాలని - దేశవ్యాప్తంగా శాఖలు ఎన్ని విస్తరించుకున్నా బ్యాంకులను మాత్రం నాలుగైదుకే పరిమితం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ దిశగా ఇప్పటికే బ్యాంకుల విలీనం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఎస్ బిఐలో పలు అసోసియేట్ బ్యాంకుల విలీనంతో ఉత్సాహంగా ఉన్న ఆర్థిక శాఖ మరో నాలుగు బ్యాంకులను ఏకీకరణ చేసే పనిలో పడింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులైన సిండికేట్ బ్యాంకు - కెనరా బ్యాంకు - విజయా బ్యాంకు - దేనా బ్యాంకులు విలీనంపై ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖకు వివరణాత్మక ప్రణాళికలు అందాయట. విలీనంపై నీతి అయోగ్ సూచనలు స్వీకరించి ఆ ప్రకారం వీటిని మెర్జ్ చేసేయాలన్నది కేంద్రం ఆలోచన.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ - మైసూర్ వంటివాటితో పాటు భారతీయ మహిళ బ్యాంకులను గతేడాది స్టేట్ బ్యాంకులో విలీనం చేసేశారు. ఏప్రిల్ నుంచే ఈ బ్యాంకులన్నీ ఎస్ బిఐ పేరుతో సేవలందించడం ప్రారంభించాయి. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. తాజా ప్రతిపాదనలో ఉన్న నాలుగు బ్యాంకులు విలీనంపై ఆర్థిక శాఖ సీనియర్ అధికారికి విడివిడిగా తమ నివేదికలను అందజేశాయి.
ఇందులో రుణాలు - డిపాజిట్లు - మొండి బాకీలు - మానవ వనరులు - ఇతర ఆదాయాలు - వివిధ భౌగోళిక ప్రాంతాల్లో శాఖలు తదితర వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అవి సమర్పించాయి. ఈ నివేదికల ఆధారంగానే బ్యాంకుల విలీన సాధ్యాసాధ్యాలపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఇదే రకమైన నివేదికలను ఇతర బ్యాంకుల నుంచి కూడా సమీకరించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.
మరోవైపు బ్యాంకుల విలీనంపై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకుల విలీనాల వల్ల ఖాతాదారులు - ఉద్యోగులకు కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశం ఉందన్న విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా ఈ రంగంలో ఉద్యోగ నియామకాలు పడిపోనున్నాయి. బ్యాంకుల మధ్య పోటీ తగ్గనుంది. దీంతో సేవల్లో నాణ్యత తగ్గి ఖాతాదారులు నష్టపోయే ప్రమాదముంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/