Begin typing your search above and press return to search.

మోడీ ఫోక‌స్ మారిందోచ్

By:  Tupaki Desk   |   25 April 2016 11:29 AM GMT
మోడీ ఫోక‌స్ మారిందోచ్
X
ప్ర‌భుత్వ పథకాల ప్రచారంపై కేంద్ర ప్ర‌భుత్వం ఫోక‌స్ పెంచింది. సర్కార్ ప‌థ‌కాలకు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. ఇకపై పబ్లిసిటీలో మోడీ ముద్ర స్పష్టంగా కనిపించనుంది. జాతీయవాద నేతల పేర్లను కూడా చేర్చే ఆలోచన చేస్తోంది. పథకాల ప్రచారానికి మాస్ మీడియాను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని డిసైడైంది.

సినిమా హాళ్లలో ఇకపై చిత్ర ప్రదర్శనకు ముందు తప్పనిసరిగా సర్కార్ యాడ్ ఉండాలని మంత్రుల బృందం ప్రభుత్వ పథకాల ప్రచారంపై ఏర్పాటైన సూచించింది. ఎన్డీయే సర్కార్ విజయాలు...యూపీఏ వైఫల్యాలను యానిమేషన్ రూపంలో చూపించాలని చెప్పింది. జాతీయ ప్రసార మాధ్యమాలైన దూరదర్శన్ - ఆకాశవాణిలతో పాటు ఇతర ఛానెల్స్ లో వారానికి రెండు సార్లు కేంద్రమంత్రులు ముఖాముఖిలో పాల్గొనాలని సూచించింది. టీవీ - రేడియో - వార్తాపత్రికల్లో ప్రకటనలతో పాటు ఫీల్డ్ పబ్లిసిటీపై కూడా ఫోకస్ చేయాలని మంత్రుల బృందం సిఫార‌సు చేసింది. రోడ్లు - బస్టాండ్లు - రైల్వేస్టేషన్లు - విమానాశ్రాయాలతో పాటు కేంద్రప్రభుత్వ కార్యాలయాల్లో పథకాలకు ప్రచారం కల్పించాలని వివ‌రించింది. వీటితో పాటు స్టేజ్ ప్రోగ్రాంలపై కూడా దృష్టిసారించాల‌ని ప్ర‌తిపాదించింది.

ఇకపై కేంద్ర పథకాలన్నింటినీ కేంద్రమంత్రులు - ఎంపీల సమక్షంలోనే ప్రారంభించాలని మంత్రుల బృందం ప్ర‌తిపాదించింది. పథకాల అమలుపై తనిఖీలు చేసేందుకు ఎంపీలకు రాజ్యాంగబద్ద అధికారులు కల్పించాలని సూచించింది. ఈ విషయమై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ పథకాల అమలులో ఈ ప్రతిపాదనలను అమల్లో పెడతామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రచారం చేసుకోవడం తప్పేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు.