Begin typing your search above and press return to search.
పోలవరం కాకి లెక్కలు…బాబుకు చుక్కలు
By: Tupaki Desk | 13 Sep 2016 11:30 AM GMT విభజన నాటి నుంచి పోలవరం ప్రాజెక్టుపై అన్నిపార్టీలు ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాయి. తాజాగా ప్యాకేజీ ప్రకటనలోనూ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన సందర్భంలో కూడా పదే పదే పలు సార్లు పోలవరం అంశాన్ని తెరపైకి తెచ్చారు పోలవరానికి నిబంధనల మేరకు నిధులిస్తామంటూ హామీలిచ్చారు. ఇంతకీ పోలవరానికి కేంద్రం ఇస్తామన్న నిధులెన్ని.. ఆ మొత్తం పోల వరాన్ని పూర్తి చేసేందుకు సరిపోతుందా అన్న సందేహాలు రాష్ట్ర ప్రభుత్వానికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. పోలవరానికి జాతీయహోదా కల్పిస్తామని హామినిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర విభజన బిల్లులో కూడా పేర్కొన్నారు. ఇదే విషయాన్నిప్పుడు బిజెపి నేతలు పదే పదే తిరిగి హామీలుగా చెప్పుకొస్తున్నారు. ఓ వైపు ఈ ప్రాజెక్ట్ ను 2018లోగా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. పైగా కేంద్రం నిధులిస్తాననడంతో ఈ ప్రక్రియలో వేగం పెంచేందుకు రాష్ట్రం సమాయత్తమౌతోంది. అయితే కేంద్రమిచ్చే నిధుల్తో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందా? కేంద్రం విభజన నాటి ధరల ప్రకారం పోలవరం నిర్మాణ అంచనాల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. 2014 ఏప్రిల్ 1వ తేదీనాటికి పోలవరం నిర్మాణ అంచనా 16,010.45కోట్లు. ఇది కూడా 2010-11నాటి ధరల కనుగుణంగా రూపొందించిన ప్రతిపాదనలు. వీటిని ఆ తర్వాత సవరించలేదు. ఇందులో విద్యుత్ ఉత్పాదన - తాగునీటి సరఫరా కోసం 2.868కోట్లు కేటాయించారు. ఈ రెండు అంశాలు జాతీయహోదా పరిధిలోకి చేర్చలేదు. దీంతో ఈ మొత్తాన్ని 16,010.45కోట్ల నుంచి మినహాయించారు. కాగా అంతవరకు రాష్ట్రం ఈ ప్రాజెక్ట్ పై 5,135.87కోట్లు వ్యయం చేసింది. ఇందులో 562.46కోట్లను కేంద్రం అప్పటికే చెల్లించింది. కాగా మిగిలిన 8,006.58కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్ట్ వ్యయం క్రింద కేంద్రం రాష్ట్రానికి చెల్లించనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 90మేరకు పోలవరం డ్యామ్ - కాలువల నిర్మాణాన్ని మాత్రమే పేర్కొన్నారు. 7.20లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిసరఫరా చేసే ప్రాజెక్టుగానే దీన్ని పరిగణించారు. 2005-06నాటి ధరలకనుగుణంగా 2009లో అప్పటి ప్లానింగ్ కమిషన్ ప్రాజెక్ట్ వ్యయాన్ని 10,151.04కోట్లుగానే అంచనాలేసింది. వీటినే కేంద్రమిప్పుడు పరిగణనలోకి తీసుకుంటోంది. 2009నాటి అంచనాల్ని కాదని 2014నాటికున్న వ్యయ ప్రతిపాదనల్ని పరిగణనలోకి తీసుకున్నా రాష్ట్రానికిప్పుడు పోలవరం ఖాతా కింద దక్కేది 8.006 కోట్లేనని నిపుణులు అంచనాలేస్తున్నారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 10శాతాన్ని రాష్ట్రం భరించాలి. అంటే సుమారు 1300కోట్లు రాష్ట్ర వాటా అవుతుంది. ఇప్పటికే రాష్ట్రం 5,135కోట్లు వ్యయం చేసింది. ఇందులో 1300కోట్ల రాష్ట్ర వాటా పోగా మిగిలిన 3,800కోట్లు కేంద్రం నుంచి రావాలి. అందులో 562కోట్లను ఇప్పటికే చెల్లించింది. ఇదిపోను 3,238కోట్లు మాత్రం కేంద్రం నుంచి తిరిగిరావాల్సుంది. ప్రాజెక్ట్ క్రింద ఇచ్చే 8వేల కోట్లు రాష్ట్రానికి తిరిగి చెల్లించే 3,200కోట్లు కలిపినా ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశాల్లేవు. ఇప్పటికే ఈ వ్యయం 32వేల కోట్లకు చేరింది. దీంతో కేంద్రం ఇచ్చే సాయంతో పోలవరం పూర్తికాదు. రాష్ట్రం మరో 20వేల కోట్లు పెట్టుబడిపెడితే తప్ప ఆశించిన ఫలితం చేతికందదంటూ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ మేరకు లెక్కలు వేసుకుని పోలవరం విషయంలో తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి కేంద్రం కాకి లెక్కలు ఏపీని దారుణంగా ముంచడం ఖాయంగా కనిపిస్తోంది.