Begin typing your search above and press return to search.

ట్విటర్ కి కేంద్రం గట్టి హెచ్చరిక .. ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   28 May 2021 7:30 AM GMT
ట్విటర్ కి కేంద్రం గట్టి హెచ్చరిక .. ఏమైందంటే ?
X
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ పై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం ఉందన్న ట్విట్టర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని వ్యాఖ్యానించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ పైన, విలువలపైనా శతాబ్దాలుగా భారత్ కు ఎంతో పేరు ఉందని సమాచార, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆ సంస్థకు రాసిన లేఖలో పొందుపరిచింది. మీ విదేశీ ఎంటిటీ మాకు పాఠాలు చెప్పనవసరం లేదని తెలిపింది. అనవసరపు గోల చేయడం మాని భారతీయ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది.

మీరు మీ చర్యలతో భారతీయ లీగల్ సిస్టం ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని, మీరు మాకు నీతి వాక్యాలు చెప్పవలసిన పని లేదని సమాచార, టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ దేశ చట్టాలను మీరు పాటించాల్సిందే.అని ఈ శాఖ స్పష్టం చేసింది మీది సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ మాత్రమే. అది గుర్తుంచుకోండి.. మా లీగల్ పాలసీని శాసించే లేదా ఇందులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదని ….దీన్ని అవగాహన చేసుకుంటే మంచిది అని కూడా వ్యాఖ్యానించింది. కాగా ఇండియాలో భావప్రకటనా స్వేచ్ఛ పట్ల అనుమానాలను వ్యక్తం చేస్తూ ట్విటర్ అనుచిత అభిప్రాయాలను వ్యక్తీకరించింది. పైగా ఇండియాలో తమ సంస్థ ఉద్యోగుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.