Begin typing your search above and press return to search.
ఇంత పచ్చి మోసమా.. కాపు తమ్ముళ్ల కన్నెర్ర!
By: Tupaki Desk | 3 Jan 2018 4:23 AM GMTఇదిగో రిజర్వేషన్ ఇచ్చేస్తున్నా.. అని చంద్రబాబునాయుడు ప్రకటించేసరికి రాష్ట్రంలో ఉన్న కాపులందరూ పండగ చేసుకున్నారు. రిజర్వేషన్ కోసం ఉద్యమించే ఆలోచనతో ఉన్నవాళ్లంతా కూడా ఆ ఐడియాకు నీళ్లొదిలేసారు. తాము చెప్పిన డెడ్ లైన్ కంటె ముందుగానే చంద్రబాబునాయుడు రిజర్వేషన్ లు ఇచ్చేసినందుకు ఆయనను అభినందించారు. సన్మానాలు కూడా జరిగాయి. చంద్రబాబు పట్ల తీవ్రమైన వ్యతిరేకతతో ఉండే ముద్రగడ పద్మనాభం వంటి వారు మాత్రం.. రిజర్వేషన్ కోటా మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. కాపుల ఉత్సాహాతిరేకాల్లో... దానికి విలువ దక్కలేదు. నేడో రేపో కాపులకు రిజర్వేషన్ లు అమల్లోకి వచ్చేస్తాయని అంతా ఎందురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వీరందరికీ పార్లమెంటులో లోక్ సభ సాక్షిగా.. కేంద్రమంత్రి వెల్లడించిన సమాచారం అశనిపాతంగా మారుతోంది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మరీ ఇంత పచ్చి మోసాపనికి పాల్పడిందా అని కాపు తమ్ముళ్లు నివ్వెరపోతున్నారు. ప్రభుత్వం మీద కన్నెర్ర చేస్తున్నారు.
ఇంతకూ విషయం ఏంటంటే... ఏపీలో కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటన తర్వాత.. ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాపులకు కూడా బీసీ రిజర్వేషన్ కల్పిస్తానంటూ.. చంద్రబాబు ఎన్నికలకు ముందుగానే మేనిఫెస్టో లోనే హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ హామీని నెరవేర్చాల్సిందేనంటూ ఒకవైపు రాష్ట్రంలోని కాపు వర్గం మొత్తం ఉద్యమిస్తున్నప్పటికీ.. కమిషన్ పేరిట - అధ్యయనాల పేరిట మూడున్నరేళ్లపాటూ జాగుచేసిన బాబు సర్కారు మొత్తానికి డిసెంబరులో నిర్ణయం తీసుకుంది.
ఒకవైపు ముద్రగడ పద్మనాభం వంటి వారు డిసెంబరు 6 లోగా తేల్చకుంటే.. ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్తాం అని హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల ముందుగానే చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ ల వరాన్ని ప్రకటించారు. ఈ బిల్లును శాసనసభ కూడా ఆమోదించింది. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ రిజర్వేషన్ లకు చట్టబద్ధత రావాలంటే.. ఈ బిల్లును కేంద్రానికి పంపి.. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో జతచేయించాల్సి ఉంది. ఆ ప్రక్రియ చేయబోతున్నట్లుగా చంద్రబాబు ప్రకటించి ఊరుకున్నారు. కాపులంతా.. ఇవాళో రేపో కేంద్రం నుంచి శుభవార్త వస్తుందని ఎదురుచూస్తున్నారు.
తీరా మంగళవారం నాడు తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అసలు కాపుల బిల్లు ఏదీ ఇప్పటిదాకా రాష్ట్రం నుంచి కేంద్రానికి రాలేదని మంత్రి లోక్ సభలో చెప్పారు. దీంతో కాపులందరూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఇంత పచ్చిగా మోసం చేస్తారా అంటూ కన్నెర్ర చేస్తున్నారు. మరి చంద్రబాబు ఇందుకు ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకుంటారో చూడాలి.