Begin typing your search above and press return to search.

ఏపీ రాజ‌ధాని విష‌యంలో కేంద్రం `దొంగాట‌` తాజా అప్డేట్ ఇదే!

By:  Tupaki Desk   |   20 Nov 2021 5:30 AM GMT
ఏపీ రాజ‌ధాని విష‌యంలో కేంద్రం `దొంగాట‌` తాజా అప్డేట్ ఇదే!
X
ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో చంద్ర‌బాబు వ్య‌య ప్ర‌సాల‌కు ఓర్చుకుని.. అంద‌రినీ ఒప్పించి.. మెప్పించి ఏర్పాటు చేసిన రాజ‌ధాని. రైతుల‌ను కాళ్లావేళ్లా ప‌డి మ‌రీ 33 వేల ఎక‌రాల‌ను స‌మీక‌రించి అద్భుత‌న‌గ‌రిని ఆంధ్ర‌లకు అంద‌జేయాల‌ని క‌లలు క‌న్నారు. అయితే.. ఆయ‌న ప్ర‌భుత్వం ప‌డిపోయి.. వైసీపీ స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డేవో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ.. దీనిని పక్క‌న పెట్టింది. అదేస‌మ‌యంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాల‌నే పేరుతో వికేంద్రీక‌ర‌ణ సూత్రాన్ని ప‌ఠిస్తోంది.

అయితే..కేంద్రం కూడా ఈ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది. ఆదిలో అమ‌రావ‌తికి సాక్ష‌త్తూ.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీనే శంకుస్థాప‌న చేశార‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టి.. మ‌రీ.. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధించ‌లేక‌.. ఇబ్బంది ప‌డుతోంది. గ‌తంలో కొన్నాళ్లు భౌగోళిక మ్యాప్‌లో విశాఖ‌ను రాజ‌ధానిగా చూపించింది. దీంతో తీవ్ర ఆగ్ర‌వేశాలు వెల్లువెత్తాయి. దీంతో వెన‌క్కి త‌గ్గిన కేంద్రం.. మూడు రాజ‌ధానులు అంటూ మ‌రో సారి గ‌ళం వినిపించింది. దీనిపైనా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ఇక‌, ఇటీవ‌ల నేవీ వ‌ర్గాలు నూతనంగా తీసుకువ‌చ్చిన ఒక నౌక‌రు కేపిట‌ల్ విశాఖ‌ప‌ట్నం పేరు పెట్టే ప‌య‌త్నం చేశారు. అయితే.. దీనిపైనా కాక రావ‌డంతో వారు వెన‌క్కి త‌గ్గారు. ఇలా రాజ‌ధాని విష‌యంలో కేంద్రం ఇబ్బందులు ప‌డుతోంది. దీంతో ఇప్పుడు ఎందుకొచ్చిన గొడ‌వ అనుకుందో ఏమో.. ఏకంగా.. ఏపీ రాజ‌ధాని ఏదీ? అంటే.. హైద‌రాబాద్ అని చూపిస్తోంది. వాస్త‌వానికి విభ‌జ‌న చ‌ట్టంలో హైద‌రాబాద్‌ను ప‌దేళ్ల‌పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా పేర్కొన్నారు. కానీ, చంద్ర‌బాబు ఆత్మ గౌర‌వం పేరుతో 2016లోనే నూత‌న రాజ‌ధానికి శంకు స్థాప‌న చేయించారు.

దీనిని కేంద్రం కూడా గుర్తించింది. అయితే.. బాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు అమరావతికి బదులుగా మూడు రాజధానులుగా పేర్కొనటం తో కేంద్రం ఇర‌కాటం లో ప‌డింది. జ‌గ‌న్ తీసుకు వ‌చ్చిన ఈ మూడును కాద‌నేలేక పోతోంద‌నే వాద‌న ఉంది. అయిన‌ప్ప‌టికీ.. అప్పుడ‌ప్పుడు మూడు రాజ‌ధానుల‌ను ప్ర‌స్తావిస్తోంది. దీంతో ఇది వివాదంగా మారుతోంది. ఈ నేప‌థ్యం లో తాజాగా హైద‌రాబాద్ రాజ‌ధానిగా పేర్కొంటే.. ఏగొడ‌వా ఉండ‌ద‌ని.. టెక్నిక‌ల్గా కూడా స‌మ‌ర్ధించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని.. కేంద్రం భావిస్తోంది. దీంతో తెలివిగా ఏపీ రాజ‌ధాని విష‌యంలో దొంగాట ఆడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.