Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా చాన్సే లేదు.. మళ్లీ చెప్పేసిన కేంద్రం

By:  Tupaki Desk   |   19 Dec 2018 3:39 PM GMT
ప్రత్యేక హోదా చాన్సే లేదు.. మళ్లీ చెప్పేసిన కేంద్రం
X
ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక ప్యాకెజీ ఇప్పటికే ప్రకటించామని వెల్లడించింది. ఏపికి ప్రత్యేక హోదా పై రాజ్యసభలో ఆడిగిన ప్రశ్నలకు కేంద్రం ఈమేరకు సమాధానమిచ్చింది. ప్రత్యేక హోదాపై టిడిపి సభ్యుడు రవీంద్రకుమార్‌ రాజ్యసభలో ప్రశ్న అడిగారు. విదేశీ సంస్థల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేసింది. 14 వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమలులో లేదని తెలిపింది.

మరోవైపు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ ఆవరణలో టిడిపి ఎంపీలు నిరసన కొనసాగించారు. ఎంపీ శివప్రసాద్ కట్ట బ్రహ్మన వేషంలో వచ్చి కాసేపు హడావుడి చేయగా.. మిగతా టీడీపీ ఎంపీలంతా ఎప్పటిలా ప్లకార్డులు పట్టుకుని షో చేశారు.

కేంద్రంలోని ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తరువాత ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మరింత బిగుసుకుంది. ఆ పార్టీ పార్లమెంటులో వినిపిస్తున్న డిమాండు వినిపించుకునేవారే కరవవుతున్నారు. రఫేల్ డీల్ వంటి విషయాల్లో పార్లమెంటు అట్టుడుకుతుండడంతో టీడీపీ ఎంపీల గోడును పట్టించుకునేవారే కరవవుతున్నారు. అంతేకాదు.. చంద్రబాబు కొత్త చుట్టం కాంగ్రెస్ కూడా కనీసం టీడీపీ ఎంపీలకు మాట సాయం అందించడం లేదట.