Begin typing your search above and press return to search.
గుట్టుగా చెల్లిస్తే అంతే గుట్టుగా ఉంచుతారట
By: Tupaki Desk | 12 July 2016 4:31 AM GMTఆదాయాన్ని దాచేసి.. నల్లధనాన్ని పోగేసిన ఎంతోమంది నల్లకుబేరులకు తమ తప్పుల్ని ఒప్పుల్ని చేసుకునేందుకు వీలుగా మోడీ సర్కారు ఒకఆఫర్ ఇవ్వటం తెలిసిందే. ఆదాయ వెల్లడి పథకంలో భాగంగా తాము పోగేసిన నల్లధనం గురించి వివరాల్ని స్వచ్ఛందంగా చెప్పేసి తాము సంపాదించిన దాన్లో 45 శాతాన్ని కేంద్రానికి గుట్టుగా కట్టేస్తే సరిపోతుందంటూ ఒక పథకాన్ని కేంద్రం ప్రకటించటం తెలిసిందే. గత నెల 1న స్టార్ట్ అయిన ఐడీఎస్ పథకం సెప్టెంబరు చివరికి ముగియనుంది.
ఈ పథకం తమ నల్లధన వివరాల్ని వెల్లడించిన వారి పేర్లను ఎట్టిపరిస్థితుల్లో బయట పెట్టమన్న భరోసాను తాజాగా మరోసారి ప్రకటించింది. బ్లాక్ మనీకి సంబంధించిన చెల్లింపులు జరిపిన నల్ల కుబేరుల జాబితాను ఎట్టిపరిస్థితుల్లోనూ బయటపెట్టే అవకాశం లేదని సీబీడీటీ తాజాగా స్పష్టం చేసింది. తమ ఆదాయం (బ్లాక్ మనీ)లో 45శాతం చెల్లిస్తే చాలని.. వారిపై ఎలాంటి కేసులు.. విచారణలు ఉండవని.. ఈ విధానాన్ని వ్యక్తులకు ఎలాంటి విధానాలు అనుసరిస్తామో.. కంపెనల విషయంలోనూ అదే రీతిలో వ్యవహరించనున్నట్లుగా ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పష్టం చేసింది. బ్లాక్ మనీ వివరాల్ని తమకు తాముగా వెల్లడించిన వారి వివరాల్ని ఐటీ శాఖతో కూడా పంచుకోమని తేల్చి చెబుతున్నారు. మరింత భరోసా తర్వాత అయినా.. బ్లాక్ మనీని పోగేసిన ఘనులు తమ వివరాల్ని బయటపెడతారా?