Begin typing your search above and press return to search.
మన బంగారం గనులను మళ్లీ తవ్వుతారట
By: Tupaki Desk | 28 Jan 2017 4:31 PM GMTచైనా తరువాత ప్రపంచంలో పెద్దమొత్తంలో బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ లో సొంతంగా బంగారం వెలికితీతపై దృష్టి సారించారు. దేశంలో 15 ఏళ్ల కిందట మూతపడిన బంగారు గనులను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి ఆ గనుల్లో దాదాపు రూ.13,600 కోట్ల విలువైన నిల్వలున్నట్లు అంచనా. దీంతో సఆయా గనుల్లో ఉన్న స్వర్ణాన్ని వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దక్షిణ కర్ణాటకలోని కోలార్ గనులు త్వరలో పునరుద్ధరించనున్న వాటిలో ముఖ్యమైనవి. ఈ గనుల పునరుద్ధరణ ద్వారా దేశంలో ఉన్న బంగారం కొరతను అధిగమించడమే కాకుండా స్థానికంగా ఉపాధి కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ప్రభుత్వ రంగంలోని భారత్ గోల్డ్ మైన్స్ సంస్థ ఆర్థిక పరిస్థితిని, ఆ సంస్థ కార్మికులకు, ఇతర సంస్థలకు చెల్లించవలసిన బకాయిలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ కార్యక్రమాన్ని సమీక్షించిన కేంద్ర ఖనిజ మంత్రిత్వశాఖ ఎస్ బీఐ క్యాపిటల్ బ్యాంకుకు అప్పగించింది. ఆ బ్యాంకు పాత గనుల పునరుద్దరణ విషయమై సానుకూలంగా ఉందని సమాచారం. ఈ విషయమై వచ్చే నెలలో నివేదిక సమర్పించే అవకాశం ఉందని, కేంద్రం వీటిని తెరువ వచ్చని భావిస్తున్నారు.
ఇదిలాఉండగా....తాజాగా 354 బంగారు బిస్కట్లను డీఆర్ ఐ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో చోటుచేసుకుంది. ఈ అక్రమ బంగారంపై సమాచారం అందుకున్న డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ ఐ)కు చెందిన అధికారులు కోల్‌కతాలోని ఓ ఫ్లాట్‌పై దాడిచేసి పట్టుకున్నారు. బంగారు బిస్కట్లను తూకం వేయగా 41 కేజీలుగా తేలింది. బిస్కట్లపై విదేశీ ముద్రలు ఉన్నాయి. ఈ నేపథ్యలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/