Begin typing your search above and press return to search.
అన్నీ చెబుతారు...అది మాత్రం పట్టించుకోరు..
By: Tupaki Desk | 9 Sep 2015 3:53 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఒక సీబీఐ ప్రత్యేక కోర్టు ఏర్పాటు కాబోతోంది. కేసులు ఎక్కువ అవుతున్నాయో లేదో గానీ.. ఇప్పుడు రాష్ట్రం విడిగా ఏర్పడిన నేపథ్యంలో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు సంబంధించి ఒక సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కేంద్రం ఏపీ సర్కారుకు లేఖ రాసింది. మన రాష్ట్రంలో మాత్రమే కాదు.. జమ్ము కాశ్మీర్ లలో ఒక్కొక్కటి,వెస్ట్ బెంగాల్ లో మరో మూడు కూడా ఏర్పాటు అవుతాయిట.
అయితే ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే.. సీబీఐ కోర్టు ఏపీ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోమని కోరుతున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును విడగొట్టి ఏపీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం గురించి మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులు, రాష్ట్ర సర్కారు, ఎంపీలు అందరూ కూడా హైకోర్టు విభజన గురించి ఏడాదిగా పోరాడుతూనే ఉన్నారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. కానీ ఏపీలో కొత్త హైకోర్టు ఏర్పాటుకు కేంద్రమే నిధులు ఇవ్వాల్సి ఉన్నందున దీనికి సంబంధించి కేంద్రం పట్టించుకోవడం లేదు.
నిజానికి సత్వరం హైకోర్టును విభజించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే విభజిస్తే.. ఏపీలో హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేయాలనేది తేలుతుంది. అసలే రాజధాని లేక.. ఎలాంటి రాష్ట్రస్థాయి కార్యాలయాలు లేక..కునారిల్లుతున్న రాయలసీమకు హైకోర్టు ఇస్తే ఆ ప్రాంతానికి కాస్త మేలు జరుగుతుంది అలా కాకుండా.. అమరావతి నిర్మాణం తర్వాతే హైకోర్టు విభజనను తేలిస్తే.. కేంద్రీకృత అభివృద్ధి లాగా అదికూడా అక్కడికే తరలిపోతుంది. అప్పటిదాకా ఎదురుచూడడం తెలంగాణకు నష్టం, అప్పుడు గుంటూరుకు తరలిపోతే రాయలసీమ కు నష్టం. రెండు నష్టాలు జరుగుతాయి. సీబీఐ కోర్టు గురించి శ్రద్ధ చూపించినట్లే హైకోర్టు గురించి కూడా కేంద్రం పట్టించుకుంటే బాగుంటుంది.