Begin typing your search above and press return to search.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

By:  Tupaki Desk   |   26 July 2021 1:30 PM GMT
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
X
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేస్తూ ఆంధ్రులు గొంతు చించుకున్నా కేంద్రం వైఖరి మాత్రం ఈసమెత్తు అయినా మారడం లేదు. ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వైఖరి మాత్రం మారడం లేదు.

విశాఖ స్టీల్ ప్లాట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీలో ఉద్యమాలు సాగుతున్నా కూడా జాతీయ స్థాయిలో ఉద్యమానికి రంగం సిద్ధమవుతున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గడం లేదని స్పష్టం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో పునరాలోచన చేసేది లేదని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం అదే సమాధానం ఇవ్వడం వివేషం.

తాజాగా ఈరోజు లోక్ సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంపై ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణను వెనక్కి తీసుకోవాలని కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చినా సరే దీనిపై వెనక్కి తగ్గమని కేంద్రం స్పష్టం చేస్తోంది.

గతంలో రాజ్యసభ సభ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం, తాజాగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కూడా అదే సమాధానం ఇవ్వడం విశేషం.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణలో రెండో ఆలోచనే లేదని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించి తీరుతామని కేంద్రమంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చాడు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతోంది. పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువచ్చి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఈ దిశగా కార్యారణ ప్రారంభించాయి. పాదయాత్రలు, బైక్ ర్యాలీలతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణే ధ్యేయంగా ప్రైవటీకరణను ఉపసంహరించుకోవాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 1, 2 తేదీలలో ‘చలో పార్లమెంట్’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఇటీవల విశాఖ కార్మిక సంఘాల నాయకులు నిర్ణయించారు. కేంద్రం వెనక్కి తగ్గనని ప్రకటించడంతో ఈ ఉద్యమం మరింతగా ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.