Begin typing your search above and press return to search.
రాఫెల్ పై బీజేపీ పీచేముడ్..దొరికనట్టేనా.?
By: Tupaki Desk | 31 Oct 2018 8:17 AM GMTమోడీ సత్యహరిశ్చంద్రుడు అని ఇన్నాళ్లు చెప్పిన బీజేపీ నేతలు.. ఇప్పుడు తీరు మార్చుకోవాలేమో.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ చేస్తున్న బలమైన ఆరోపణలకు బలాన్ని ఇచ్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు షాక్ ఇచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు - ధరపై పూర్తి వివరాలు ఇవ్వాలని పదిరోజుల క్రితం సుప్రీం కోర్టు... బీజేపీ ప్రభుత్వానికి అల్టీమేటం జారీ చేసింది. కానీ ఆ వివరాలను బహిర్గతం చేయలేమని కేంద్ర ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టుకు తెలిపి షాక్ ఇచ్చింది.
రాఫెల్ ఒప్పందంలో పెద్ద కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ సహా ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని మోడీ తనకు సన్నిహితుడైన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ ను భారత ప్రభుత్వమే ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ చేసిన వ్యాఖ్యలు దేశంలో కలకలం రేపాయి. దీంతో రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు చేపట్టాలని కోరుతూ సుప్రీం కోర్టులో పలువురు పిటీషన్లు దాఖలు చేశారు.
ఒప్పందం విలువ, యుద్ధవిమానాల ధరలపై సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రానికి 10 రోజుల క్రితం సూచించింది. అయితే యుద్ధవిమానాల డీల్ గుట్టు చాలా ప్రత్యేకమైందని.. దీన్ని న్యాయస్థానంతో పంచుకోలేమని ప్రభుత్వ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తాజాగా కేంద్రం వైఖరిని సుప్రీంలో వెల్లడించారు. సాంకేతికపరమైన అంశాలు కాకుండా ధర ఎంతో చెప్పాలని సుప్రీం కోర్టు కోరినా ఆయన పంచుకోలేమని తేల్చిచెప్పారు. దీంతో విచారణను నవంబర్ 14కు సుప్రీం కోర్టు వాయిదావేసింది.
రాఫెల్ గుట్టు విప్పమని బీజేపీ ప్రభుత్వం సుప్రీంకు చెప్పడంతో ఇందులో కుంభకోణం దాగి ఉందన్న కాంగ్రెస్ మాటలకు బలం చేకూరినట్టైంది. రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని మరింత రాజేసి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. రాఫెల్ తో ఇరుక్కుపోయిన బీజేపీ ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తుందనేది హాట్ టాపిక్ మారింది.