Begin typing your search above and press return to search.
పోలవరంపై బాబు దూకుడుకు చెక్ పడినట్టే!
By: Tupaki Desk | 31 Aug 2017 8:13 AM GMTసీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా చెబుతున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆయన దూకుడుకు బ్రేక్ పడనుందా? ఆయన ఆటలు ఇక సాగవా? ప్రతి పనికీ లెక్క చెప్పాల్సిందేనా? ప్రతి పైసాకూ బాధ్యత వహించాల్సిందేనా? అంటే తాజా పరిణామాలు ఔననే సమాధానమే ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఏమో కానీ, ఇప్పుడు కేంద్రం పోలవరంపై విధివిధానాలను ప్రకటించింది. తాము దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామని, దీనిని బాబుకు పూర్తిగా వదలి పెట్టేయలేదని చెప్పకనే చెప్పింది. అదే సమయంలో బాబుకు దూకుడుకు కళ్లెం వేసేలా చర్యలు సైతం ప్రారంభించింది.
విషయంలోకి వెళ్తే.. వచ్చే ఏడాది కాలానికి అవసరమైన ప్రాజెక్టు నిధులను కేంద్రం మంజూరు చేయాలని నిర్ణయించింది. దేశంలో ఏ రాష్ట్రానికీ - ఏ ప్రాజెక్టుకూ ఇవ్వని విధంగా రూ. 24 వేల కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో ఇది కేంద్ర ప్రాజెక్టు కనుక ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయం రూ.979 కోట్లను కూడా ఇచ్చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రెండు పరిణామాలు నిజంగా సంచలనంతో కూడుకున్నవే. దీనిని అందరూ ఆహ్వానించాల్సిందే.
అయితే, అదే సమయంలో కేంద్రం ఈ ప్రాజెక్టుపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ.. నిబంధనలను రూపొందించింది. ప్రధానంగా పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టుల్లో కమీషన్ వరద పారుతోందని, అందుకే కాంట్రాక్టర్లు ఆలస్యం చేస్తున్నా ఎవరూ మాట్టాడడం లేదని, ఆలస్యం అయ్యే కొద్దీ ప్రాజెక్టు విలువ పెరిగిపోతోందని ఫలితంగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతోందని ఇటీవల కేంద్రానికి సమాచారం అందింది. దీంతో పనులను పరిశీలించడంతోపాటు తగిన సమయంలో పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం(పీఎంయూ) ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.