Begin typing your search above and press return to search.

శ్రీ లక్ష్మి కి రిలీఫ్..జగన్ టీంలో కీలక భూమిక ఆమెదేనా?

By:  Tupaki Desk   |   14 Aug 2019 9:27 AM GMT
శ్రీ లక్ష్మి కి రిలీఫ్..జగన్ టీంలో కీలక భూమిక ఆమెదేనా?
X
సీనియర్ ఐఏఎస్ అధికారిణిగానే కాకుండా విధి నిర్వహణలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించున్న శ్రీలక్ష్మీ కల ఎట్టకేలకు నెరవేరబోతోందనే చెప్పాలి. తాజాగా ముగిసిన ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపర్ విక్టరీ కొట్టి... ఏపీకి సీఎం అయ్యారు. ఎన్నికల రిజల్ట్ విడుదల కాగానే... అప్పటిదాకా తెలంగాణ కేడర్ సర్వీసులో కొనసాగుతున్న శ్రీలక్ష్మీ అమరావతి వచ్చి నేరుగా జగన్ తో భేటీ అయ్య ారు. తాను ఏపీలో పనిచేయాలనుకుంటున్నానని, తనకు అవకాశం కల్పించాలని కూడా ఆమె జగన్ ను కోరారు. ఇందుకు జగన్ కూడా సరేననడంతో ఆమె... తన సర్వీసును ఏపీకి మార్చాలంటూ కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు.

కేంద్రం ఓకే అంటే... శ్రీలక్ష్మీని రిలీవ్ చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్ధంగాినే ఉంది. అయితే కారణాలేంటో తెలియదు గానీ... జగన్ సీఎం దాదాపు 75 రోజులు అవుతున్నా కూడా శ్రీలక్ష్మీ రిక్వెస్ట్ పై కేంద్రం స్పందించలేదు. అయితే తాజాగా శ్రీలక్ష్మీ రిక్వెస్ట్ కు సానుకూలంగా స్పందించిన కేంద్రం... ఆమె సర్వీసును ఏపీకి మార్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు శ్రీలక్ష్మీని ఏపీకి రిలీవ్ చేయాలని తెలంగాణ సర్కారుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతోొ ఒకటి రెండు రోజుల్లోనే శ్రీలక్ష్మీ ఏపీకి బదిలీ అయిపోతారన్న మాట.

ఇక్కడి దాకా బాగానే ఉన్నా... ఏపీకి మారే శ్రీలక్ష్మీకి జగన్ ఏ బాధ్యతలు అప్పగిస్తారన్న విషయంపై ఇప్పటికే లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. జగన్ సర్కారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్యన నవరత్నాలు అమలు కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని, దాని సారథ్య బాధ్యతలు శ్రీలక్ష్మీకే అప్పగిస్తారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ెఎంతమేర నిజముందో తెలియదు గానీ... తెలంగాణ నుంచి ఏపీకి వచ్చీ రాగానే శ్రీలక్ష్మీకి ఏపీ సీఎంఓ (జగన్ కార్యాలయంలో) కీలక పోస్టింగ్ ఇవ్వనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం అమెరికా పర్యటనకు వెళ్లనున్న జగన్... తిరిగి వచ్చిన వెంటనే శ్రీలక్ష్మీ ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరుగుతోంది.