Begin typing your search above and press return to search.
టీ కి షాక్:కొత్త నిధులకు పాత ఖర్చుల లెక్క పరీక్ష
By: Tupaki Desk | 17 Aug 2015 7:20 AM GMTతెలంగాణ రాష్ట్ర సర్కారుకు కొత్త చిక్కొచ్చి పడింది. కేంద్రం ఇస్తున్న నిధుల విషయంపై రాష్ట్ర సర్కారు లెక్కల చిట్టాలో ఫుల్ బిజీ అయిపోయింది. తన డిమాండ్ల విషయంలో పట్టుదలగా ఉంటూ.. కేంద్రానికి సినిమా చూపిస్తున్న తెలంగాణ రాష్ట్ర సర్కారుకు.. తాజాగా కొత్త చిక్కొచ్చి పడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకూ తాము విడుదల చేసిన నిధులకు సంబంధించిన లెక్కలు చెప్పాలని తేల్చి చెప్పింది. ఇప్పటివరకూ తాము విడుదల చేసిన నిధులకు సంబంధించిన లెక్కలు చెప్పిన తర్వాతే కొత్త నిధులు విడుదల చేస్తామని.. అప్పటివరకూ కుదరదని కరాఖండిగా చెప్పేసింది. కేంద్రం విడుదల చేసిన నిధులను ఏ విధంగా ఉపయోగించారు? ఎంతమేర వినియోగించారో చెప్పిన తర్వాత మాత్రమే కొత్త నిధుల గురించి అడగాలని చెప్పటంతో.. నిధుల లెక్కలు తేల్చేందుకు అధికారులు కిందామీదా పడిపోతున్నారట.
మరి.. ఈ ఖర్చుల లెక్క ఎప్పటికి తీరేను? కొత్త నిధులు ఎప్పటికి వచ్చేను? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి లెక్కలు అడుగుతున్నది తమ ఒక్కరినేనా? మిగిలిన రాష్ట్రాల్లో కేంద్రం వైఖరి ఎలా ఉందన్న ప్రశ్నలు రేగి.. వాటి గురించి సమాచారం సేకరించాల్సిందిగా ప్రభుత్వం చెప్పినట్లుగా చెబుతున్నారు.
మరి.. ఈ నిధులు.. లెక్కల వ్యవహారం కేంద్రం.. తెలంగాణ రాష్ట్ర సర్కారు మధ్య దూరాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఐటీ శాఖ రిజర్వ్ బ్యాంకు నుంచి తీసేసుకున్న రూ.1200కోట్లకు పైగా నిధులతో విపరీతమైన కొరత ఎదుర్కొంటున్న తెలంగాణ సర్కారుకు.. కేంద్రం తాజా ఆదేశం తెలంగాణ ప్రభుత్వానికి మరింత ఇబ్బంది కలిగించటం ఖాయమని చెబుతున్నారు.