Begin typing your search above and press return to search.

ఏపీకి షాకిస్తూ మోడీ స‌ర్కార్ మ‌డ‌త పేచీలు!

By:  Tupaki Desk   |   8 July 2018 5:04 AM GMT
ఏపీకి షాకిస్తూ మోడీ స‌ర్కార్ మ‌డ‌త పేచీలు!
X
ప్ర‌తిపాద‌న ఏదైనా స‌రే.. ఏపీ నుంచి వ‌చ్చిందంటే చాలు.. ప‌క్క‌న పెట్టేయ‌టం మోడీ స‌ర్కారుకు ఒక అల‌వాటుగా మారింది. విభ‌జ‌న నేప‌థ్యంలో అభివృద్ధి ప‌థంలో ఏపీ ప‌య‌నించాలంటే కేంద్ర స‌ర్కారు సాయం చాలా అవ‌స‌రం. ప‌లు అనుమ‌తుల విష‌యంలో ఏపీకి ద‌న్నుగా ఉండాల్సిన మోడీ స‌ర్కార్.. ఈ మ‌ధ్య‌న మ‌డ‌త పేచీలు పెట్టేస్తోంది. ప్ర‌తిపాద‌న ఏదైనా సానుకూల స్పంద‌న ఈ మ‌ధ్య‌న రావ‌టం లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఇందుకు విజ‌య‌వాడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి సంబంధించిన ప‌లు ప్ర‌తిపాద‌న‌ల్ని ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. విజ‌య‌వాడ నుంచి సింగ‌పూర్ కు నేరుగా ఇంట‌ర్నేష‌న‌ల్ చార్ట‌ర్డ్ ఫ్లైట్ స‌ర్వీసుల్ని న‌డిపే ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర స‌ర్కార్ నుంచి సానుకూల స్పంద‌న రావ‌టం లేదు.

ఓవైపు ఇదే త‌ర‌హా ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్న ఇత‌ర రాష్ట్రాల విష‌యంలో సానుకూలంగా స్పందిస్తున్న మోడీ స‌ర్కారు.. ఏపీ విష‌యంలో మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌ర్యాట‌కులు.. రాజ‌ధాని నిర్మాణ అవ‌స‌రాల్ని దృష్టిలో ఉంచుకొని విజ‌య‌వాడ నుంచి నేరుగా సింగ‌పూర్ కు చార్టెర్డ్ ఫ్లైట్స్ న‌డ‌పాల‌ని డిసైడ్ చేశారు. ఇందుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌ల్ని కేంద్రానికి పంపారు. అయితే.. అంత‌ర్జాతీయంగా చార్ట‌ర్డ్ ఫ్లైట్స్ కు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని డీజీసీఎ చెప్పినట్లుగా చెబుతున్నారు. ఏపీకి నో చెబుతూనే.. మ‌రోవైపు కేర‌ళ‌.. గోవా.. త‌మిళ‌నాడుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మిగిలిన రాష్ట్రాల‌కు అనుమ‌తులు ఇస్తున్న కేంద్రం.. ఏపీ విష‌యంలో మాత్రం భిన్నంగా ఎందుకు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ల‌భించ‌టం లేదు. కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన అశోక్ గ‌జ‌ప‌తి రాజు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన నాటి నుంచి స‌ద‌రు మంత్రిత్వ శాఖ నుంచి ఏపీకి అనుమ‌తులు ల‌భించ‌టం ఇప్పుడు గ‌గ‌నంగా మారింద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. సింగ‌పూర్ కు నేరుగా చార్టెర్డ్ ప్లైట్స్ న‌డిపేందుకు నో చెప్పిన కేంద్రం.. ఈ మ‌ధ్య‌న దుబాయ్‌ కు అంత‌ర్జాతీయ విమాన‌స‌ర్వీసుల్ని ఏర్పాటు చేసే విష‌యంలోనూ కొర్రీ పెట్టి ఆపేసిన‌ట్లుగా చెబుతున్నారు. భ‌ద్ర‌తా కారాణాల‌తో జంపింగ్ ఫ్లైట్స్ కు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. మిగిలిన రాష్ట్రాల‌కు లేని భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల‌న్ని ఏపీకే ఎందుకు ఉన్న‌ట్లు..?