Begin typing your search above and press return to search.
మన రాష్ట్రాలకు షాకిచ్చిన కేంద్రం
By: Tupaki Desk | 24 Nov 2016 4:35 AM GMTకేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలకు ఏకకాలంలో షాకిచ్చింది. ఓట్ల రాజకీయాలకు పాల్పడుతూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే రీతిలో సాగుతున్న ఇరు పార్టీల తీరుకు షాకిచ్చేలా తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచడం ప్రస్తుతానికి సాధ్యం కాదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 170(3)వ అధికరణం ప్రకారం 2026వ సంవత్సరం తర్వాత జరిగే జనాభా లెక్కల వివరాలు ప్రచురితం అయ్యేంతవరకు దేశంలో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సాధ్యం కాదని తెలిపింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 అమలు కావాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలంగాణ, ఏపీలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరుగాల్సి ఉన్నదని, అయితే ఇందుకు రాజ్యాంగంలోని 170వ అధికరణం అడ్డంకిగా ఉన్నందువల్ల దానిని సవరించాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ ఆహిర్ గంగారాం పేర్కొన్నారు.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అడిగిన ఒక ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2026వ సంవత్సరం తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల వివరాలను ప్రచురించేంతవరకు రాష్ట్రంలో శాసనసభ నియోజకర్గాల పునర్వ్యవస్థీకరణ సాధ్యం కాదని రాజ్యాంగంలోని 170(3) అధికరణం చెప్తున్నదని పేర్కొన్నారు. అందువల్ల అప్పటివరకు సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదన్న అంశాన్ని ఆటార్నీ జనరల్ తన అభిప్రాయంలో వెల్లడించారని మంత్రి తెలిపారు. రాజ్యాంగంలోని ఈ అధికరణానికి సవరణ జరగనంతవరకూ సీట్ల సంఖ్యను పెంచడం సాధ్యం కాదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 అమలు కావాలంటే ఈ సవరణ అనివార్యమన్నారు. కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం.. 2026వ సంవత్సరం తర్వాత జనాభా లెక్కల సేకరణ జరిగేది 2031వ సంవత్సరంలోనే. ఆ వివరాలన్నింటినీ క్రోడీకరించి నివేదిక విడుదల చేయడానికి రిజిస్ట్రార్ జనరల్ విభాగానికి కనీసం మూడేండ్లు పడుతుంది. అంటే 2034వ సంవత్సరం వరకు దేశంలో పార్లమెంటరీ లేదా శాసనసభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సాధ్యం కాదు. కానీ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం చూసినట్లయితే కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతమున్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు పెంచాల్సి ఉంటుంది. సెక్షన్ 26లో రాజ్యాంగంలోని 170వ అధికరణానికి అనుగుణంగా అనే పదాలు ఉన్నాయి. అందువల్లనే 170వ అధికరణంతో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశానికి వైరు ధ్యం తలెత్తింది.
అయితే రాజ్యాంగంలోని 3 - 4 అధికరణాల కింద ఏర్పడిన చట్టానికి రాజ్యాంగంలోని మరే అధికరణాన్నయినా అధిగమించి నిర్ణయం తీసుకునే అధికారం ఉందనేది నిపుణుల భావన. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని 3 - 4 అధికరణాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించినందువల్ల రాజ్యాంగంలోని 170వ అధికరణంలో ఏ వక్కాణింపు ఉన్నప్పటికీ దానికి అతీతంగా చట్టం లో పేర్కొన్న సెక్షన్లను అమలులోకి తేవచ్చన్న భావన కూడా వ్యక్తమవుతోంది. ఈ భరోసా ఆధారంగానే ఇద్దరు సీఎంలు ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయనే ఆసక్తితో పావులు కదుపుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/