Begin typing your search above and press return to search.
కేసీఆర్ ‘అప్పు’కు కేంద్రం బ్రేకులు
By: Tupaki Desk | 26 Jun 2016 5:00 AM GMTసంపన్న రాష్ట్రం.. మిగులు రాష్ట్రంగా తరచూ చెప్పుకునే తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాను చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పుల్ని తీసుకురావాలన్న నిర్ణయాన్ని తీసుకోవటమే కాదు.. ఇప్పటికే ఉన్న పరిమితిని మరింత పెంచుకొని మరికాస్త అప్పు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3 శాతం మేర రుణాలు సేకరించుకునే అవకాశం ఉన్నా.. తమది మిగులురాష్ట్రమని.. సంపన్న రాష్ట్రమైన కారణంగా తమకు అదనంగా 0.5శాతం అదనపు అప్పు తెచ్చుకోవాలని భావిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన తెలంగాణ ప్రభుత్వం.. మోడీ సర్కారు ఆమోదాన్ని కోరింది.
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.23,467 కోట్ల మేర అప్పులు తేవాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది.కేంద్రం సూచించిన 3 శాతం కంటే ఎక్కువ రుణాల్ని తీసుకురావటానికి కేంద్ర అనుమతి అవసరం. అందుకే.. అదనపు అప్పు కోసం కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని సంప్రదించింది. తమది మిగులు రాష్ట్రమైన నేపథ్యంలో కొత్త అప్పు తెచ్చుకోవటానికి కేంద్రం నుంచి అనుమతులు ఇట్టే వస్తాయని తెలంగాణ ప్రభుత్వం భావించింది.కానీ.. ఊహించని రీతిలో ఈ వ్యవహారం మీద కేంద్రం కొర్రీ పెట్టింది.
అయితే.. ఇదంతా సాంకేతికమనే చెబుతున్నారు. ఎందుకంటే.. అదనపు అప్పు గురించి కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించే క్రమంలో ఒక కొత్త అంశాన్ని గుర్తించింది. అదేమంటే.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ తమ రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పేర్కొంటున్న నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాల స్థూల ఉత్పత్తిని కలిపి సరాసరి చేస్తే.. అది దేశ స్థూల ఉత్పత్తితో సరిపోకపోవటంతో కేంద్రం అలెర్ట్ అయ్యింది. ఎందుకిలా అన్న ప్రశ్న వేసుకొన్న కేంద్రం.. కొన్ని రాష్ట్రాలు తమ స్థూల ఉత్పత్తిని ఎక్కువగా పెంచేసి చూపిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించారు. అలాంటి రాష్ట్రాలు ఏవి? ఎంత పెంచి చూపాయన్న విషయాల్ని పరిశీలించి.. లెక్కలు తేల్చిన తర్వాతనే కొత్త అప్పులకు ఓకే చెప్పాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో.. ఇప్పటికే ఉన్న 3 శాతం పరిమితికి 0.5శాతం అదనపు పరిమితిని జత చేయాలన్న కేసీఆర్ ఆలోచనలకు కేంద్రం తాత్కాలికంగా కొర్రీ పెట్టింది. తాను గుర్తించిన రాష్ట్రాల స్థూల ఉత్పత్తి లెక్కల్లోని వ్యత్యాసాల్ని సరి చేసిన తర్వాతే తెలంగాణ ప్రభుత్వ వినతికి ఓకే చెప్పే అవకాశం ఉందంటున్నారు.