Begin typing your search above and press return to search.

పసిడి ప్రేమికులకు అలర్ట్...బంగారం హాల్ మార్కింగ్ : కేంద్రం కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   14 April 2021 9:30 AM GMT
పసిడి ప్రేమికులకు అలర్ట్...బంగారం హాల్ మార్కింగ్ : కేంద్రం కీలక నిర్ణయం !
X
బంగారం హాల్ మార్కింగ్ ను అమల్లోకి తీసుకువస్తునట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగారం క్రయవిక్రయాలకు సంబంధించి బంగారం హాల్‌ మార్కింగ్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ కొత్త రూల్స్ జూన్ 1 నుండి అమలులోకి రాబోతున్నాయి. ఇప్పటికే పెద్ద పెద్ద ఆభరణాల విక్రయశాలలు హాల్ మార్కింగ్ నగలను విక్రయిస్తున్నాయి. హాల్ మార్కింగ్‌ ను తప్పనిసరి చేస్తామని కేంద్రం 2019 నవంబర్ నెలలో ప్రకటించింది. పసిడి నాణ్యత, నకిలీ బంగారు మోసాల నుంచి ప్రజలను రక్షించడం, బంగారు ఆభరణాలను విక్రయించే జువెలర్స్‌ కు చట్టబద్దమైన ప్రమాణాలను నిర్దేశించడం వంటి ప్రధాన లక్ష్యాల కోసం కేంద్ర ప్రభుత్వం గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ ‌ను అమల్లోకి తీసుకువస్తునట్టు తెలిపింది .

సాధారణంగా 2021 జనవరి 15 నుంచే గోల్డ్ హాల్ మార్కింగ్ రూల్స్ అమలులోకి రావాల్సి ఉన్నప్పటికి , ఈ గడువును జూన్ 1కి పొడిగించారు. దీనికి కరోనా వైరస్ ప్రధాన కారణం. జువెలర్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS వద్ద రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. కొత్త రూల్స్ అమలులోకి వస్తే.. జువెలర్స్ 14 క్యారెట్, 18 క్యారెట్, 22 క్యారెట్ బంగారాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. అంతేతప్ప ఇంకా తక్కువ ప్యూరిటీ ఉన్న బంగారాన్ని అమ్మడానికి కుదరదు. అలాగే బీఐఎస్ మార్క్ కంపల్సరీ. ప్రస్తుతం దేశంలో 40 శాతం బంగారం మాత్రమే హాల్‌ మార్క్ ‌కు వెళ్తోంది.జువెలరీ షాపులు కచ్చితంగా గోల్డ్ హాల్‌‌మార్క్ కలిగిన బంగారాన్ని మాత్రమే విక్రయించాలి. అయితే ప్రజలు వారి వద్ద ఉన్న పాత బంగారాన్ని సులభంగానే విక్రయించొచ్చు. వీటికి గోల్డ్ హాల్ మార్క్ అవసరం లేదు.

బిఐఎస్ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తక్కువగా నిర్ణయించారు. టర్నోవర్ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7500, రూ.5 కోట్ల నుండి 25 కోట్లు టర్నోవర్ అయితే రూ.15,000, రూ.25 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.40 వేలు చెల్లించాలి. టర్నోవర్ రూ.100 కోట్లు దాటితే రూ.80 వేలు చెల్లించాలి. హాల్ మార్క్ ‌కు గతంలో 15 జనవరి 2021 వరకు గడువు ఇచ్చారు. జ్యువెల్లరీ అసోసియేషన్ డిమాండ్ మేరకు జూన్ 1వ తేదీ వరకు పొడిగించారు. జువెలరీ సంస్థలు కొత్తగా అమల్లోకి రాబోతున్న రూల్స్ ఫాలో కాకపోతే, జైలు శిక్ష తో పాటుగా భారీగా జరిమానా విధించే అవకాశం ఉంది.