Begin typing your search above and press return to search.
కేంద్రం కీలక నిర్ణయం .. ప్రాంతీయ భాషల్లోనూ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ !
By: Tupaki Desk | 4 Jun 2021 8:30 AM GMTకరోనా వైరస్ కట్టడికి దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మందికి వ్యాక్షన్లు వేశారు. కరోనా వైరస్ టీకా రిజిస్ట్రేషన్ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొవిన్ పోర్టల్, ఇప్పుడు హిందీతో సహా 10 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తెలుగు, మరాఠీ, మలయాళం, పంజాబీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ, ఒడియా భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునేలా మార్పులు చేసినట్లు వెల్లడించింది.
అయితే కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన ఉన్నతస్థాయి మంత్రుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో 18ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా పొందాలంటే కొవిన్ పోర్టల్ లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ సమయంలో భాష కారణంగా సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించిన అధికారులు.. ప్రాంతీయ భాషలను అందుబాటులోకి తీసుకువచ్చింది. భాష ఇబ్బందుల కారణంగా ప్రజలు టీకా కేంద్రాల్లోని సిబ్బంది సహకారం తీసుకుంటున్నారు. దానివల్ల సిబ్బందిపై ఒత్తిడి పడుతుందని గుర్తించిన ప్రభుత్వం, హిందీతో సహా పలు ప్రాంతీయ భాషల్లోకి ఈ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చింది. వారిపై ఒత్తిడి తగ్గడం వల్ల ఎక్కువ మందికి టీకా ఇచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక, దేశవ్యాప్తంగా జనవరిలో ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 22కోట్ల మందికిపైగా టీకాలు అందాయి.