Begin typing your search above and press return to search.
సైబర్ నేరాలకు చెక్ పెట్టిన కేంద్రం... ఏప్రిల్ 1 ఆ చెల్లింపులకు బ్రేక్!
By: Tupaki Desk | 29 March 2021 3:30 AM GMTసైబర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. విద్యావంతులూ సైతం సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు. ఫలితంగా లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఆగడాలకు చెక్ పెట్టాడానికి కేంద్రం సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో ఆటోమేటిక్ గా జరిగే చెల్లింపులు(స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్స్)పై ఆంక్షలు విధించింది. నెలనెలా గృహ రుణాలు, వాహన రుణాల నుంచి టెలిఫోన్ బిల్లుల వరకు వాటంతట అవే చెల్లింపులు జరిగే విధంగా స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తుంటారు కొందరు. అయితే ఈ విధానాలపై కేంద్రం పలు మార్పులు తీసుకొచ్చింది.
ఆంక్షలు వర్తిస్తాయ్
ఇకపై అన్ని సేవలకు స్టాండర్డ్ ఇన్ స్ట్రక్షన్స్ ఉండవని కేంద్రం ప్రకటించింది. ఇంటి రుణాలు, వాహన, ఎల్ఐసీ, మ్యూచువల్ ఫండ్స్ వంటి కొన్ని సేవలకు మాత్రమే మినహాయింపు ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్, డీటీహెచ్, ఫోన్ బిల్లుల వంటి సేవల ఆటోమేటిక్ చెల్లింపులు ఉండవని తేల్చి చెప్పింది. ఆ సంస్థ వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు జరపవచ్చని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఓటీపీ కీలక పాత్ర పోషిస్తుంది.
ఏప్రిల్ 1 నుంచి అమలు
ఏప్రిల్ 1 నుంచి ఈ విధానం అమలులోకి రానుంది. ఆంక్షలు విధించిన సేవలు డీయాక్టివేట్ అవుతాయి. ఈ విషయాలను బ్యాంకులు ఇప్పటికే తమ ఖాతాదారులకు చేరవేశాయి. క్రమంగా సైబర్ మోసాలు పెరగడం.. ఉన్నత ఉద్యోగులు సైతం బాధితులు కావడం వల్లే సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానంతో సైబర్ నేరాలకు కాస్త బ్రేక్ పడినట్లవుతుందని అంటున్నారు విశ్లేషకులు.