Begin typing your search above and press return to search.
కేంద్రం పెట్టుకున్న 200 కోట్ల టీకా టార్గెట్ అసాధ్యమట
By: Tupaki Desk | 28 May 2021 10:30 AM GMTకొవిడ్ కు చెక్ పెట్టే టీకాల విషయంలో మోడీ సర్కారు అనుసరించిన వ్యూహం బెడిసి కొట్టటమే కాదు.. ఆయన ఈమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. వ్యాక్సిన్ విషయంలో మోడీ సర్కారు ఆలోచన ఏ మాత్రం సరిగా ఉన్నా.. ఆయన్ను ఇప్పుడు టచ్ చేసే పరిస్థితి ఉండేది కాదు. వ్యాక్సినేషన్ విషయంలో ఆయన వ్యూహాం పూర్తిగా ఫెయిల్ కావటం.. సెకండ్ వేవ్ నష్టం ఆయన ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారింది. ఇలాంటివేళ.. జరిగిన నష్టమేదో జరిగింది.. రానున్న రోజుల్లో దాన్ని సరిదిద్దేందుకు భారీ ప్లానింగ్ చేస్తున్నట్లుగా మోడీ సర్కారు చెబుతోంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది చివరకు (డిసెంబరులో) దేశంలో 200 కోట్ల వ్యాక్సిన్లను తీసుకొచ్చే భారీ ప్లానింగ్ గురించి గొప్పగా చెబుతోంది. అయితే.. ఈ లక్ష్య సాధన అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు ప్రముఖ వైరాలజిస్టు గగన్ దీప్ కాంగ్. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె.. వ్యాక్సినేషన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశోధనల సమయంలోనే టీకా కొనుగోలు మీద మోడీ సర్కారు ఫోకస్ చేసి ఉంటే.. ఇప్పుడున్న పరిస్థితి ఉండేది కాదన్నారు.
అమెరికాతో సహా పలు దేశాలు పరిశోధనల దశలోనే భారీగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ఉంటే.. ఇప్పటి పరిస్థితి ఉండేది కాదన్నారు. వైరస్ ను ఎదుర్కోవటం అంత సులువైన పని కాదన్నారు. టీకాల్ని పరిశోధనల సమయంలోనే కొనుగోలు చేసే రిస్కును మోడీ సర్కారు తీసుకొని ఉంటే.. ఇప్పుడీ తిప్పలు ఉండేవి కావన్నారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి 200 కోట్ల డోసుల్ని సమకూర్చుకుంటామని చెబుతున్న కేంద్రం మాటలు.. ఆచరణలో అసాధ్యమని చెబుతున్నారు.
‘డిసెంబరు నాటికి అన్ని టీకాల్ని సేకరించటం సాధ్యం కాకపోవచ్చు. అయితే.. సాకారం కావాలని కోరుకుంటున్నా. టీకాల విషయంలో మన పరిస్థితో ఎలాంటి మార్పు లేదు. ధనిక దేశాలన్ని తమ ప్రజలకు టీకాలు వేసే వరకు భారత్ వెయిట్ చేయాల్సిందే. ఆయా దేశాల్లో జనాభా తక్కువ. వారి వ్యాక్సినేషన్ పూర్తి అయితే.. మనకు టీకాలు అందుబాటులోకి వస్తాయి. ఏడాది చివరకు టీకా సరఫరా పరిస్థితి మెరుగుపడే వీలుంది’ అన్న వ్యాఖ్య చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో మోడీ సర్కారు వైఫల్యం ఏడాది చివరి వరకూ జాతి జనులు చూడాల్సిందేనన్న మాట.