Begin typing your search above and press return to search.
రాష్ట్రాలకు షాక్: విద్యుత్ రంగం త్వరలోనే కేంద్రం పరిధిలోకి..?
By: Tupaki Desk | 3 May 2020 4:30 AM GMTభారతదేశంలో చాలా రంగాలు కేంద్రం - రాష్ట్రం - ఉమ్మడి పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి అంశాల్లో ఉన్న వాటిపై కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని అంశాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా రాష్ట్ర పరిధిలోని కొన్ని విభాగాలు - శాఖలపై పెత్తనం చెలాయించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడుతాయి. ఇప్పుడు తాజాగా కేంద్రం మరో చర్య తీసుకోబోతోంది. త్వరలోనే కేంద్రం రాష్ట్రాలకు షాక్ ఇచ్చేలా పరిణామం ఉంది.
ఈ క్రమంలోనే ఒక శాఖను తన పరిధిలోకి లాక్కునేందుకు ప్రయత్నం చేస్తోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ రంగంపై పూర్తి అజామాయిషీ కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతుల్లోకి తీసుకెళ్లేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ శాఖను తీసుకెళ్లాలనుకునే దాని వెనక పెద్ద ఉద్దేశం ఉంది. అదేమిటంటే.. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆ చర్యలకు అడ్డుకట్ట వేసి విద్యుత్ రంగాన్ని కాపాడాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం విద్యుత్ చట్టంలో పలు కీలక సవరణలను తీసుకురానుంది.
రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా పలు నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. అందులో భాగంగా చట్టంలో తీసుకొస్తున్న మార్పులపై రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకొస్తున్న సవరణల్లో రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ - ఇద్దరి సభ్యుల నియామకం అత్యంత ప్రధానమైంది. ఇప్పటివరకు రాష్ట్రాలే నియమిస్తున్నాయి. ఇకపై ఈ నియామకాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయని సమాచారం.
ఇప్పుడు కేంద్రం నియమించే కమిటీలో జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గా - కొందరు విద్యుత్ రంగ నిపుణులతో కమిటీని వేస్తారు. ఈ కమిటీ రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్ లను - సభ్యుల పేర్లను సిఫార్సు చేస్తుంది. ఈ మేరకు కేంద్రమే ఈఆర్సీ చైర్మన్ లను - సభ్యులను నియమిస్తుంది. అయితే నియంత్రణ మండలి నిర్వహణ వ్యయాలను రాష్ట్రమే భరించాలని - కేంద్రం ఆదేశాలను పాటించాలి.
ఇక విద్యుత్ రాయితీలపై కేంద్రం బాధ్యత వహించదు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రకటించే రాయితీలకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏమాత్రం బాధ్యత వహించవంట. ఉచిత విద్యుత్ పారిశ్రామిక రాయితీలు, ఎస్సీ - ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్ - గృహాలకు అందిస్తున్న రాయితీలకు అయ్యే మొత్తాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి అని చట్టంలో ఉండబోతుందని సమాచారం. ఇవన్నీ చర్యలు తీసుకోవడంతో డిస్కమ్ లు బలపడతాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటివరకు విద్యుత్ ధరలను తగ్గించాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్రం నోటీసులు జారీ చేస్తుండటం, సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో పాటు కేంద్రం వద్ద పేచీ ఉన్నాయి. ఇప్పుడు అలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే శాశ్వత విధానం ఉండాలని కేంద్రం భావించింది. కేంద్రం పరిధిలో కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అంశాన్ని ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టంలో ఉంది. ఈ అథారిటీ ఏర్పడితే రాష్ట్రాలు పీపీఏలను పున:సమీక్షించేందుకు ఆస్కారం ఉండదు. ఈ విషయంపై రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా గ్యాస్ - పెట్రోలింగ్ ఉత్పత్తుల ధరలను నిర్ణయిస్తున్నట్టు మాదిరి ఒకే దేశం- ఒకే విద్యుత్ ధరను కేంద్రం ఖరారు చేస్తుంది. కేంద్ర విద్యుత్ చట్టంలో చేసే మరో ముఖ్యమైన సవరణ ఒకే దేశం- ఒకే విద్యుత్ ధర. ఇది సవరణల్లో కీలక అంశం. ఈ నిబంధనతో విద్యుత్ ధరలను నిర్ధారించే అధికారం రాష్ట్రాలకు ఉండదు. విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టం వాటిల్లుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు కోసం కరెంటు ధరలను పెంచకుండా ఉంచడం ఇకపై సాధ్యం కాదు. ఏఆర్సీలతో సమావేశమై వాస్తవ ఆదాయ వ్యయాలను కేంద్రమే సమీక్షిస్తుంది.