Begin typing your search above and press return to search.

విదేశీ డ్రోన్ల పై కేంద్రం ఆంక్షలు.. మేకిన్ ఇండియాకు మద్దతుగా..!

By:  Tupaki Desk   |   10 Feb 2022 3:30 PM GMT
విదేశీ డ్రోన్ల పై కేంద్రం ఆంక్షలు.. మేకిన్ ఇండియాకు మద్దతుగా..!
X
ప్రస్తుతం డ్రోన్ల ను ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా వినియోగిస్తున్నారు. ఒకప్పుడు చాలా అరుదుగా కనిపించే ఈ పరికరాలు ప్రస్తుతం చాలా కార్యక్రమంలో హంగామా చేస్తున్నాయి. గిర్రుమని వేడుక జరిగే ప్రదేశంలో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా వివాహాది కార్యక్రమాల్లో డ్రోన్ల పాత్ర చాలా కీలకంగా మారింది. దీంతో తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు గానూ వివిధ ఫోటోగ్రాఫర్లు ఈ డ్రోన్లను ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. అంతే కాకుండా పెరిగిన సాంకేతికతను వినియోగించుకుని అనేక రంగాల్లోకి ప్రవేశించింది ఈ డ్రోన్.

గతంలో కేవలం పెళ్లిళ్ల వరకు మాత్రమే పరిమితమైన ఈ డ్రోన్లు ఇప్పుడు వాణిజ్య, వ్యవసాయ, రవాణా,వస్తు సరఫర లాంటి వాటి కోసం అభివృద్ధి చెందిన నగరాల్లో వినియోగిస్తున్నారు. అయితే గతంలో ఉపయోగించిన విధంగా ఇకపై డ్రోన్ వినియోగం అనేది ఉండకపోవచ్చు అని అంటున్నారు అధికారులు. దీనికి ప్రధాన కారణం తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం.

ఈ నిర్ణయం కారణంగా ఇకపై డ్రోన్లు దిగుమతి చేసుకోవాలి అంటే కేంద్ర ఏవియేషన్ నియమ నిబంధనలు అనుసరించవలసి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

డ్రోన్లను కేవలం రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం వినియోగించాలని అదేశాలు జారీ చేశాయి. అంతేగాకుండా దేశ రక్షణ విభాగంలో వినియోగించవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ సంబంధిత శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై వీటి దిగుమతులపై కేంద్రం దృష్టి సారించనున్నట్లు తెలిస్తోంది. పూర్తిగా విదేశాల్లో తయారైన డ్రోన్లను వినియోగించడం పై కేంద్రం తీసుకున్న తాజా ఆంక్షలు త్వరలో అమల్లోకి రానున్నాయి.

తాజా ఉత్తర్వులు ప్రకారం ఇక పై వ్యవసాయ, మెడిసిన్, వివాహాది శుభకార్యాలు షూటింగా లకు డ్రోన్ లను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే దానికి అవ్వదు. కాకాపోతే తాజా నిబంధనల ప్రకారం మరో వెసులుబాటు కల్పించింది కేంద్రం. అది ఏంటంటే మన దేశంలో తయారు అయిన డ్రోన్లను వివిధ కార్యకలాపాలకు ఉపయోగించుకోవచ్చు. వీటిపై ఎలాంటి షరతులు విధించలేదు కేంద్రం.

మరోవైపు డిజైన్స్ అవసరాల కోసం, పరిశోధనల కోసం, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ఇతర సంస్థలు ఉపయోగించుకునేందుకు ఎటువంటి ఆంక్షలు లేవని కేంద్రం ఈ మేరకు స్పష్టం చేసింది. కావాంటే ఈ పేర్కొన్న సంస్థలు ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకునేందుకి అవకాశం కల్పించింది కేంద్రం. కానీ ఈ డ్రోన్లు కూడా కేంద్ర సర్టిఫై చేస్తేనే ఉపయోగించుకోవచ్చు. లేకపోతే లేనట్టే. గతం కొంత కాలంగా సరిహద్దుల్లో డ్రోన్ల సంచారం బాగా ఎక్కువ అయ్యింది. పాకిస్థాన్ నుంచి భారత్ కు డ్రోన్ల ద్వారా వివిధ ఆయుధాలు ఇతర వస్తువులు సరఫరా చేస్తున్నారు స్మగ్లర్లు.