Begin typing your search above and press return to search.
పొత్తుల విషయంలో ఇదే ఫైనల్.. తేల్చి చెప్పిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా..
By: Tupaki Desk | 1 Jan 2023 6:58 AM GMT2014లో కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకున్న బీజేపీ పార్టీ తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ వస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ అంతకంతకూ సీట్లను పెంచుకుంటూ పోయింది. 2018లో 2014 కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకొని మరింత పాతుకుపోయింది. ఇప్పటి వరకూ బీజేపీకి ఎదురుగా నిలిచేందుకు ఏ పార్టీ సాహసించడం లేదనే చెప్పాలి. కేంద్రంలో కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన బీజేపీ ‘కాంగ్రెస్ హాఠావో దేశ్ కి బచావో’ నినాదంతో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్ కష్టాల్లో పడింది. తన ఉనికిని కాపాడుకునేందుకే ఇప్పటి వరకూ పోరాడుతున్న కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ వెనకే ఉండిపోవాల్సి వస్తుందిని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణాదిన పాగా వేయనున్నారా..?
దక్షిణాదిన పార్టీని బలోపేతం చేసేందుకు మోడీ-షా ద్వయం ఎత్తులు వేస్తుంది. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తొమ్మిది రాష్ర్టాల్లో దక్షిణాదిన కర్ణాటకతో పాటు తెలంగాణ ఉన్నాయి. ఈ రెండు రాష్ర్టాలను కూడా కమలంలో కలుపుకోవాలని పథకాలు రచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కర్ణాటకతో పాటు తెలంగాణలో ముఖ్య నేతలను నియమించారు. చాపకింద నీరులా పార్టీ క్యాడర్ ను పటిష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ ను పూర్తిగా ఒంటరిని చేస్తూ కనుమరుగయ్యేలా చేస్తున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన టీఆర్ఎస్ దక్షిణాదిలో కర్ణాటకలో పోటీ చేయాలని కేసీఆర్ తో సహా పలువురు నేతలు పావులు కదుపుతున్నారు. అయితే తెలంగాణలో పట్టు కోల్పోతున్న బీఆర్ఎస్ కర్ణాటకలో రాణిస్తుందా..? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు రాష్ర్టాలను కైవసం చేసుకునేందుకు ఇప్పుడు అపర చాణక్యుడు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. కర్ణాటక ఎన్నికలకు సంబంధించి బెంగళూర్ లోని ప్యాలెస్ మైదానంలో బూత్ స్థాయి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ వేదిక ద్వారా పొత్తులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.
పొత్తులు ఉండబోవు: అమిత్ షా..
మోడీ-అమిత్ షా ద్వయం వచ్చినప్పటి నుంచి బీజేపీలో కొత్త ఊపు కనిపిస్తుంది. పార్లమెంట్ నుంచి అసెంబ్లీ వరకూ పార్టీని పటిష్టం చేసే దిశగా వ్యూహాలు రచించడంలో వీరి ద్వయానికి ఎదురే లేదని చెప్పాలి. ఒక్క సీటుగా ఉన్న పశ్చిమ బెంగాల్ లో దాదాపు 40కి పైగా సీట్లు సాధించి కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలకు అడ్రస్ లేకుండా చేశారు. ఎప్పటికప్పుడు ఎదురెళ్లుతున్న మహారాష్ర్టలోని శివసేన పార్టీని పడగొట్టి బీజేపీ అధికారంలోకి రావడం వెనుక భారీ వ్యూహమే ఉందని చెప్పకతప్పదు. ఇక ఇప్పుడు దక్షిణాదిన మరింత బలంగా మారేందుకు ఎత్తులు వేస్తున్నారు.
ఇటీవల బెంగళూర్ లో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్రలో మోడీ కొన్ని కీలక వ్యాఖ్యాలు చేశారు. కర్ణాటకను దక్షిణాదికి గేట్ వేగా అభివర్ణించారు. ఇక్కడి నుంచే దక్షిణాదిలో పాగా వేయాలని కార్యకర్తలు, ముఖ్య నాయకులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలో 224లో బీజేపీ పనోటీ చేస్తుందని, 150కి పైగా స్థానాలు రావడం ఖాయమని అమిషా చెప్పారు. బీజేపీ ఎన్నికల ముందు గానీ, తర్వాత గానీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ లను ఒకే నాణేంగా పోల్చిన ఆయన చిత్తు.. బొత్తు ఆటతో రాష్ర్టాన్ని అగాధంలోకి నెడుతాయని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బీజేపీలో పాలనలో అభివృద్ధిని చూస్తారని పిలుపునిచ్చారు.
తెలంగాణపై ఫోకస్
తెలంగాణలో ఈ యేడాది చివరలో ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి వరకూ రాష్ర్టంలో జరుగుతున్న పరిణాలు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగానే కనిపిస్తున్నాయి. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ క్రమ క్రమంగా అడ్రస్ కోల్పోతూ వస్తుంది. ఇంకా ఎన్నికలకు నెలలు మాత్రమే ఉండడంతో ఇప్పట్లో కాంగ్రెస్ పుంజుకోవడం కష్టమనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతూ బీజేపీ రాష్ర్ట అధినేత బండి సంజయ్ యాత్రలు చేస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే టీఆర్ఎస్ గా స్థానికంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ గా మారి నేషనల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో రాష్ర్టంపై క్రమంగా పట్టు కోల్పోతుంది అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ వివిధ పార్టీల ఓట్లను బీఆర్ఎస్ చీల్చుతుందా..? లేక డిపాజిట్ కూడా కనుమరుగవుతుందా అన్న కోణంలో వాదనాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తుకు తహతహలాడుతున్న టీడీపీ నేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. ఆంధ్రా పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న టీడీపీని ఇక్కడి ప్రజలు ఆదరిస్తారా అనే సందేహం నేపథ్యంలో తెలంగాణాలోనూ టీడీపీతో పొత్తు ఉండబోదని అమిత్ షా ప్రకటించారు. ఏ పార్టీతోనైనా పొత్తు వద్దంటూ రాష్ర్ట నేతలు కేంద్ర అధినాయత్వానికి సూచనలు చేస్తూనే ఉన్నారు.