Begin typing your search above and press return to search.
వైసీపీ హార్డ్ కోర్ స్పాట్ నుంచే అమిత్ షా స్పాట్
By: Tupaki Desk | 1 Jan 2023 11:30 PM GMTఏపీలో బీజేపీ రాజకీయాన్ని జోరెత్తించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 8న వస్తున్నారు. అమిత్ షా జనవరి 8న కర్నూల్ లో పర్యటిస్తారు అని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని పార్టీ కార్యకర్త ఇంట్లోకి వెళ్ళి వారితో మాటా మంతీ చేస్తారు. అలాగే స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకం అవుతారు.
అలాగే కేంద్ర ప్రభుత్వ పధకాలు వారికి వివరించి అమలు అవుతున్న దాని మీద వివరాలు సేకరిస్తారు. ఆ మీదట కర్నూల్ లో అమిత్ షా భారీ బహిరంగ సభ జరగనుంది అని తెలుస్తోంది. అమిత్ షా ఫస్ట్ టైం ఏపీలో ఒక రాజకీయ సభను గత మూడున్నరేళ్ల కాలంలో నిర్వహిస్తున్నారు అని చెప్పాలి.
జగన్ సీఎం అయ్యాక అమిత్ షా ఒకటి రెండు సందర్భాలలో ఏపీకి వచ్చి పార్టీ మీటింగ్స్ లో మాట్లాడి వెళ్ళిపోయారు తప్ప పబ్లిక్ మీటింగ్స్ లేవు. కానీ ఈసారి భారీ సభలో ఆయన మాట్లాడుతారు అని అంటున్నారు. అమిత్ షా ప్రసంగం అంటే మాటల తూటాలే పేలుతాయి. ఆయన రాజకీయాలు మాట్లాడకుండా ఉండరు. పైగా ఏపీలో మీటింగ్ అంటే కచ్చితంగా అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ ని టార్గెట్ చేయాల్సిందే.
ఇప్పటిదాకా జగన్ విషయంలో కేంద్రంలో బీజేపీలో ఇద్దరు పెద్దలు అయిన మోడీ అమిత్ షా మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. కేంద్రానికి జగన్ దగ్గరవాడు అన్న ఇంప్రెషన్ వైసీపీ వారే కలిగిస్తున్నారు అని బీజేపీ నేతలు అంటున్నారు. ఇక గత ఏడాది నవంబర్లో విశాఖ వచ్చిన మోడీ కూడా పార్టీ నేతలకు వైసీపీ మీద రాజకీయ పోరాటం చేయమని సూచించారు అని చెబుతారు.
అంటే మోడీ అయినా అమిత్ షా అయిన రాజకీయాలు అలాగే చూస్తారు. పైగా జగన్ మిత్రుడు కూడా కారు. అయితే కేంద్రంలో బీజేపీకి నంబర్ గేం లో భాగంగానే వైసీపీని కాస్తా స్పెషల్ గా చూస్తున్నారు అని ఢిల్లీ వర్గాలు చెబుతాయి. లోక్ సభలో 22 మంది ఎంపీలు రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్న వైసీపీ దేశంలో నాలుగవ అతి పెద్ద పార్టీగా ఉంది. అందువల్ల ఆ మర్యాదతో పాటు రాజకీయ అవసరాల దృష్ట్యా జగన్ కి మోడీ షాలు కొంచెం సన్నిహితం అన్నట్లుగా ఉంటారని చెబుతారు.
ఇక రాజకీయంగా చూస్తే బీజేపీలో ఈ ఇద్దరు నేతలు కఠినంగానే ఉంటారు. బీజేపీయే ఏకంగా దేశమంతా ఏలాలన్న కోరిక వారికి ఉంది. అవకాశం ఉండి దూసుకుపోవాలనుకునన్ చోట వారు ఏ మాత్రం తగ్గరని అంటున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే కర్నూల్ సభలో అమిత్ షా కచ్చితంగా జగన్ సర్కార్ ని టార్గెట్ చేస్తారు అని అంటున్నారు. ఇక ఇప్పటిదాక కేంద్ర మంత్రులు ఎవరు వచ్చి మాట్లాడినా జగన్ సర్కార్ మీద విమర్శలు చేసినా ఆ ఇంపాక్ట్ పెద్దగా లేదు.
కానీ అమిత్ షా జగన్ సర్కార్ మీద విమర్శలు చేసినా ప్రభుత్వ తీరును తప్పు పట్టినా కచ్చితంగా అది విపక్షాలకు ప్లస్ గా ఉంటుంది అని అంటున్నారు మరి అమిత్ షా జగన్ విషయంలో ఏమి మాట్లాడుతారో ఏ రకమైన హాట్ కామెంట్స్ చేస్తారో వేచి చూడాల్సిందే వైసీపీ సర్కార్ కి అమిత్ షా విమర్శలతో భోగీ మంట పెడితే అది తమకు రాజకీయ సంక్రాంతి అవుతుందని తెలుగుదేశం జనసేన కాచుకుని కూర్చున్నాయి. మరి వైసీపీ హార్డ్ కోర్ స్పాట్ లో అమిత్ షా పొలిటికల్ స్పాట్ ఏ రేంజిలో ఉంటుందో చూడాల్సిందే.