Begin typing your search above and press return to search.
ఏపీలో సామూహిక మత మార్పిడులపై కేంద్రం విచారణ?
By: Tupaki Desk | 22 July 2021 12:30 AM GMTఏపీలో సామూహిక మత మార్పిడులు చేస్తున్నారనే ఆరోపణలు గుప్పు మంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు ఈ విషయంపై కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తున్నారని.. చెర్చ్ ఫాదర్లకు హిందు సమాజం కడుతున్న పన్నుల నుంచి నెల నెల రూ.5000 చోప్పున భత్యం ఇస్తున్నారని.. ఇది రాష్ట్రంలో సెక్యులరిజాన్ని దెబ్బతీస్తోందని నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇదే విషయంపై ఇతర పక్షాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ హక్కుల సంఘం అధ్యక్షుడు కె. నాగరాజ కేంద్ర షెడ్యూల్ క్యాస్ట్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నడూ లేని విధంగా మత మార్పిడులు జరుగుతున్నాయని.. బలవంతంగా కూడా కొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలను మత మార్పిడికి ప్రోత్సహిస్తున్నారని.. ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న సామూహిక మత మార్పిడులపై ఎస్సీ కమిషన్ విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలు నిజమో కాదో తేల్చాలని నిర్దేశించింది.
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని బ్యాక్‌వర్డ్ క్లాసెస్ ను మత మార్పిడులకు ప్రోత్సహించడాన్ని సీరియస్‌గా భావిస్తున్నట్టు తెలిపింది. వీరిని క్రిస్టియానిటీ వైపు ప్రోత్సహించడం తగదని ఎస్సీ కమిషన్ పేర్కొంది. దీనిపై విచారణ చేసి తమకు ఈ నోటీసు అందించిన రోజు నుంచి 15 రోజుల్లో నివేదిక అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌ను జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ప్రకారం ఏర్పడిన జాతీయ ఎస్సీ కమిషన్ కు విశేష అధికారులు ఉన్నాయి. ఇది స్వయం ప్రతిపత్తిగల సంస్థ. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆదేశాలకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ క్రమంలో తాజాగా ఏపీకి పంపిన నోటీసుల్లో ఎస్సీ కమిషన్ కొన్ని హెచ్చరికలు కూడా చేసింది. తమ నోటీసు అందిన తర్వాత కూడా స్పందించక పోతే.. కమిషన్‌కు ఉన్న విశేష అదికారాలను వినియోగించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్‌కు సమన్లు పంపిస్తామని హెచ్చరించింది. అంతేకాదు.. కమిషన్ వద్దకు స్వయంగా హాజరై.. వివరణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఈ నేపథ్యంంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి సమాధానం ఇస్తుంది? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. మరి చూడాలి ప్రబుత్వ వాదన ఎలా ఉంటుందో అంటున్నారు పరిశీలకులు.