Begin typing your search above and press return to search.
'ఆపరేషన్ గంగ' పేరుతో రాజకీయాలా ?
By: Tupaki Desk | 28 Feb 2022 5:50 AM GMTకేంద్రంలోని నరేంద్రమోడి సర్కార్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐదురోజులుగా భీకరంగా జరుగుతున్న యుద్ధంలో దాదాపు 25 వేలమంది భారతీయులు ఇరుక్కుపోయారు. వీరిలో ఇప్పటికి 700 మందిని అతికష్టంమీద ఉక్రెయిన్ నుండి ప్రత్యేక విమానాలు వేయటం ద్వారా దేశానికి తెప్పించింది కేంద్రం. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ ఆ పేరుతోనే కేంద్రంలోని బీజేపీ రాజకీయం మొదలుపెట్టింది. ఉక్రెయిన్లోని భారతీయులను ఇండియాకు తరలించటాన్ని ‘ఆపరేషన్ గంగ’ అనే పేరు పెట్టారు. ఉక్రెయిన్ నుండి భారతీయులను ఇండియాకు రప్పించటానికి ఆపరేషన్ గంగ పేరు పెట్టడానికి ఎలాంటి సంబంధం లేదు. గంగానది ప్రక్షాళనకు ఆపరేషన్ గంగ పేరు పెట్టినా అర్ధముంటుంది. కానీ విదేశాల నుండి జనాలను దేశానికి తెప్పించేందుకు ఎలాంటి సంబంధం లేకుండానే ఆపరేషన్ గంగ పేరుపెట్టడంలోనే అసలైన రాజకీయముంది.
హఠాత్తుగా ఆపరేషన్ గంగ అని పేరుపెట్టడంలో ఉద్దేశ్యం ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అని అర్ధమైపోతోంది. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల్లో లబ్దిపొందటానికే ఉక్రెయిన్లోని భారతీయులను తెప్పించటానికి ఆపరేషన్ గంగ అని పేరుపెట్టారు. తాము విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ఎంతో కష్టపడి దేశానికి తెప్పిస్తున్నట్లు నరేంద్రమోడి చెప్పారు. ఉక్రెయిన్లో ఇరుక్కుపోయిన భారతీయులు తమంతట తామే పోలండ్ కు చేరుకోవాలి.
ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను పోలండ్, రుమేనియాకు తెప్పించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఏమీలేవు. తమంతట తాము భారతీయులునానా అవస్తలు పడివస్తే అలా వచ్చిన వాళ్ళని మాత్రమే ప్రత్యేక విమానాల్లో కేంద్రం భారత్ కు తెప్పిస్తోందంతే. భారతీయులను పొలండ్ కు తెప్పించటంలో భారత రాయబార కార్యాలయం చేతులెత్తేసింది. ఇంతోటిదానికి ఆపరేషన్ గంగ అనే పేరుపెట్టి మోడి షో చేస్తున్నారు.
కేవలం యూపీ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు మాత్రం ఈ ప్రక్రియకు ఆపరేషన్ గంగ అని పేరు పెట్టినట్లు అర్ధమైపోతోంది. పోలండ్ కు ప్రత్యేక విమానాలు వేసి కష్టపడి భారతీయులను స్వదేశానికి తెప్పిస్తున్నట్లు మోడి బిల్డప్ ఇస్తున్నారు. పోలండ్ నుండి భారతీయులను ప్రత్యేక విమానాల్లో తెప్పించేందుకు కేంద్రం పడుతున్న కష్టమేమిటో అర్ధం కావటంలేదు. యుద్ధం జరుగుతున్నది ఉక్రెయిన్-రష్యా మధ్యే కానీ పోలండ్ కు ఏమీ సంబంధంలేదు. ప్రశాంతంగా ఉన్న పోలండ్ కు విమానాలు వేసి అక్కడికి చేరుకున్న భారతీయులను మాత్రమే రప్పించేందుకు కేంద్రం పడుతున్న కష్టమేముంది ?