Begin typing your search above and press return to search.

వర్క్‌ ఫ్రం హోమ్ ప‌ర్మినెంట్ కావొచ్చు..కేంద్ర‌మంత్రి

By:  Tupaki Desk   |   19 April 2020 2:52 PM GMT
వర్క్‌ ఫ్రం హోమ్ ప‌ర్మినెంట్ కావొచ్చు..కేంద్ర‌మంత్రి
X
ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల‌తో పాటు భారత‌దేశంలో క‌రోనా క‌ట్ట‌డి కోసం లాక్‌ డౌన్ కొన‌సాగుతోంది. ఆయా దేశాల్లో వాణిజ్య‌ - వ్యాపార‌ - వ‌ర్త‌కం మూత‌ప‌డ్డాయి. అన్ని రంగాలు కూడా స్తంభించాయి. కేవ‌లం అత్యావ‌స‌ర సేవ‌లు మాత్ర‌మే కొన‌సాగుతున్నాయి. ఈ లాక్‌ డౌన్ స‌మ‌యంలో కొన్ని సంస్థ‌లు - వివిధ రంగాలు - ఉద్యోగులు - సిబ్బంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం అన్ని రంగాల్లో అమ‌లు చేసేందుకు ఉన్న అవ‌కాశాలు ప‌రిశీలిస్తున్నారు. ఐటీ త‌దిత‌ర రంగాల్లో మాత్రం ఆ విధానం కొన‌సాగుతోంది. అయితే వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం విధానం భ‌విష్య‌త్‌ లో ప‌ర్మినెంట్ కావొచ్చ‌ని కేంద్ర మంత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇంటి నుంచే పని విధానం భ‌విష్య‌త్‌ లో అమ‌లు చేసే ఆలోచ‌న‌లు కేంద్ర ప్ర‌భుత్వం చేస్తోంద‌ని తెలుస్తోంది.

కరోనా వైరస్‌ వెళ్లిపోయాక లాక్‌ డౌన్ ఎత్తివేశాక వర్క్‌ ఫ్రం హోమ్‌’ అనేది కొత్త ప్రామాణికంగా మారుతుందని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ చెప్పారు. కరోనా వెళ్లిపోయాక ఈ ప్రపంచం మరోలా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఇంటి నుంచి పని చేసే కొత్త ప్రామాణికం పుట్టుకొస్తుందని వెల్ల‌డించారు. భారతదేశంలో అన్ని రంగాల‌కు వర్క్‌ ఫ్రం హోమ్ పద్ధతి తెలిసేలా చేయాల‌ని తెలిపిన‌ట్లు వివ‌రించారు. ఆ విధానం ఆర్థికంగా - లాభసాటిగా.. సుల‌భంగా ఉంటుందని తెలిపారు.

అయితే కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిశీలిస్తే కేంద్రం దృష్టిలో ఇంటి నుంచే ప‌ని చేయించే విధానం కొన్ని రంగాల‌కు వ‌ర్తించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇంకా క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌గడం త‌గ్గ‌ని ప‌రిస్థితుల్లో ఆ విధానం అన్ని రంగాల‌కు అత్యావ‌స‌ర‌మ‌ని గుర్తించ‌నున్నారు.