Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రైనా కేసీఆర్ కోసం వెయిటింగే?

By:  Tupaki Desk   |   22 Nov 2019 5:15 AM GMT
కేంద్రమంత్రైనా కేసీఆర్ కోసం వెయిటింగే?
X
అదీ కేసీఆర్ అంటే.. తను కలువలనుకున్నప్పుడే కలుస్తాడు.. తనకు నచ్చితేనే చేస్తాడు.. ఎంత పెద్దవారైనా సరే తనకు వ్యతిరేకంగా లాబీయింగ్ చేస్తే కేసీఆర్ చిక్కడు.. దొరకడు.. కేసీఆర్ వ్యవహారశైలియే అంతా.. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ అదే జరిగింది..

కేసీఆర్ తో మంచిగా ఉంటే మంచిగానే సాగుతుంది.. కానీ ఎప్పుడైతే వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వాళ్లను అస్సలు ఊపేక్షించరని ఆయనను దగ్గర నుంచి చూసినవాళ్లు చెబుతుంటారు. నాడు ఆలె నరేంద్ర నుంచి విజయశాంతి, శ్రవణ్ ల వరకూ కేసీఆర్ తనపై గళమెత్తితే నేతలందరినీ దూరంగా పెట్టేస్తారు. అస్సలు కలువకుండా ఉంటారు. తనకు వ్యతిరేకంగా వెళ్లిన ఆర్టీసీ కార్మికులను కూడా స్వయంగా తాను కలవడానికి, మంత్రులు కూడా చర్చలు జరపడానికి కేసీఆర్ అనుమతించలేదు..

సామరస్యపూర్వకంగా వ్యవహరించడం.. తప్పులు చేసినా క్షమించి వారితో కలిసిపోయే రకం కేసీఆర్ కాదని చాలా మంది విమర్శిస్తుంటారు. తన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరైనా పెద్దవాళ్లు వ్యవహరించినా వారి విషయంలో కేసీఆర్ అలానే వ్యవహరిస్తారన్న పేరుంది..

తాజాగా ఏకంగా కేంద్రం ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీ నుంచి కేసీఆర్ కు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాకపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఇంట్లో లేకపోయినా ఎక్కడికెళ్లిన ఒక స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఆయన వెంట ఉంటుంది. ఆయన పీఏలో, అధికారులో పోలీసులకో ఉంటుంది. ఈరోజుల్లో ఒక సీఎం స్థాయి వ్యక్తిని కాంటాక్ట్ చేయలేకపోవడం అంటే అంతకంటే విడ్డూరం మరోటీ లేదు....

అయితే ఆర్టీసీ సమ్మె విషయంలో సమ్మె విరమించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా కేసీఆర్ కు ఫోన్ చేశారు. ఆ విషయం ముందే తెలిసిన కేసీఆర్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లిపోయారు. కేంద్రమంత్రి దాదాపు 45 నిమిషాల సేపు సంప్రదించినా ఆయన దొరకలేదు.

ఇలా కేసీఆర్ తన అభీష్టానికి వ్యతిరేకంగా కేంద్రమంత్రి చెప్పినా ఆయన ఫోన్ కు అందుబాటులోకి రాకుండా వెళ్లిపోయిన వైనం హాట్ టాపిక్ గా మారింది.