Begin typing your search above and press return to search.
జగన్ ఆలోచనలు మేమెందుకు అమలు చేస్తాం...కేంద్రం ఘాటు రిప్లై
By: Tupaki Desk | 21 Dec 2022 5:30 PMదేశంలో మొత్తం ముప్పయి మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వారందరూ చేసినవి కేంద్రం చేస్తుందా అంటూ వైసీపీ ఎంపీలను సూటిగా ప్రశ్నించారు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి, ఫైర్ బ్రాండ్ నిరంజన్ జ్యోతి. ఆమె వైసీపీ ఎంపీలు ఘాటు రిప్లై పార్లమెంట్ సాక్షిగా ఇచ్చేశారు. ఏపీలో సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అన్నది జగన్ ఆలోచనలు, అక్కడ వాటిని కొనసాగించుకోండి. కేంద్రం మీద ఎందుకు వాటిని రుద్దుతారు అని కేంద్ర మంత్రి సీరియస్ అయ్యారు.
ఇది పార్లమెంట్ లో జరిగింది. వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను దేశ వ్యాప్తంగా అమలు చేసే ఆలోచన ఏదైనా ఉందా అంటూ వైసీపీ ఎంపీలు అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరిలు పార్లమెంటులో ప్రశ్నించారు. దానికి లిఖితపూర్వక సమాధానాన్ని కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి చదివి వినిపించారు. ఆమె ఏమన్నారు అంటే గ్రామ సచివాలయ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేసే ఆలోచన లేదని కుండబద్ధలు కొట్టారు.
మీది మీరే కొనసాగించుకోండి, ఎందుకంటే ఇది ఏపీ సీఎం జగన్ కి వచ్చిన ఆలోచన అని ఆమె అన్నారు. ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీలు అడగడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన సమీక్షలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. గ్రామీణంలో ప్రభుత్వ సేవలు అందించడానికి ప్రతి రెండు వేల మందికి ఒకటి చొప్పున ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ గురించి సీఆర్ఎం నివేదికలో పేర్కొన్నారు. అయితే అది నిజమేనని ఆ విషయాన్ని కేంద్ర మంత్రి అంగీకరిస్తూనే ప్రస్తుతానికి ఆ ఆలోచన ఏదీ కేంద్రానికి లేదని తేల్చేశారు
అయితే ఆమె ఫైర్ బ్రాండ్ కావడంతో ఈ విషయం మీద కాస్తా ఘాటుగా గట్టిగానే మాట్లాడారు, దేశంలో ముప్పయి మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వారికి వచ్చే ఆలోచనలు అన్నీ కూడా కేంద్రం అమలు చేస్తుందా చేయగలదా అంటూ ఆమె మాట్లాడడమే ఈ విషయం మీద హైప్ క్రియేట్ కావడానికి కారణం అయింది.
పైగా రాష్ట్రాలు చేసే ప్రతీ కార్యక్రమాన్ని వారి ఆలోచనలను కేంద్రం చేయాలనుకోదు, అసలు మీ ఆలోచనే తప్పు అంటూ కేంద్ర మంత్రి జవాబు చెప్పడమే చర్చకు తావిస్తోంది. దాంతో వైసీపీ ఎంపీలు కూడా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. అసలు సీఆర్ఎం నివేదికను ఎందుకు అమలు చేయడంలేదు అన్న తరువాత ప్రశ్నను కూడా వైసీపీ ఎంపీలు వేయడానికి వీలు లేని విధంగా కేంద్ర మంత్రి రిప్లై ఉందని అంటున్నారు. కోరి మరీ అడిగి ఫైర్ బ్రాండ్ దూకుడుకు గురి అయ్యారా అన్నదే ఇపుడు పార్లమెంట్ లో చర్చగా ఉందిట. ఏం చేస్తాం. కేంద్ర మంత్రి చెప్పినదీ కరెక్టే అనుకోవడమే అలా సరిపెట్టుకోవడమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.