Begin typing your search above and press return to search.
జల వివాదంపై కేంద్రం జోక్యం: తెలుగు రాష్ట్రాలకు లేఖలు
By: Tupaki Desk | 21 May 2020 5:30 PM GMTఇన్నాళ్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో అన్యోన్యంగా ఉన్న తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడుతో తగువు ఏర్పడింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. దీంతో రెండు ప్రభుత్వాలు కృష్ణ బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నాయి. పరస్పరం ఫిర్యాదులను స్వీకరించిన బోర్డు విచారణ చేస్తోంది. ఈ సమయంలోనే ఈ రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుటోంది. ఈ నేపథ్యంలోనే నదీ జలాల వ్యవహారాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం లేఖలు రాశాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం తక్షణమే ఏర్పాటుచేయాలని సూచించింది.
ఆ లేఖలో ముదురుతున్న జలవివాదంపై అపెక్స్ కౌన్సిల్ సమావేశం తక్షణమే ఏర్పాటు చేయాలని కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డులు సూచించాయి. ఆయా రాష్ట్రాలు తమ ఎజెండా తీసుకుని రావాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలిపింది. ఈ వివాదంపై త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది. ఆ క్రమంలోనే రెండు రాష్ట్రాలు, కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు జలశక్తి శాఖ సమాచారం పంపింది. ఈ సమావేశం అజెండా కోసం అంశాలు పంపాలని కేంద్రం కోరింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదల కృష్ణ నది జలాలపై పరస్పరం ఫిర్యాదు చేసుకోగా.. ఇప్పుడు గోదావరి జలాలపై కూడా ఫిర్యాదులు మొదలయ్యాయి. ఈ నదీ జలాల వివాదంపై ఆయా నదుల బోర్డుల వద్దకు వెళ్లాయి. ప్రస్తుతం ఈ పంచాయితీని కేంద్ర ప్రభుత్వం పరిష్కరించేలా కనిపిస్తోంది.