Begin typing your search above and press return to search.
రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి
By: Tupaki Desk | 19 May 2022 4:15 AM GMTవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విదేశీ బొగ్గును కొనుగోలు చేసే విషయంలో రాష్ట్రప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి పెంచేస్తోంది. తప్పనిసరిగా అన్నీ రాష్ట్రాలు విద్యుత్ బొగ్గును కొనుగోలు చేసి తీరాలంటు ఆదేశాలు జారీచేసింది.
ఈనెల 31వ తేదీలోగా 10 శాతం విదేశీ బొగ్గుకొనుగోలుకు రాష్ట్రాలు ఆర్డర్లు ఇవ్వాలని గతనేలలోనే ఆదేశాలు జారీచేసింది. ఈనెల 31వ తేదీలోగా ఆర్డర్లు ఇవ్వకపోయినా, వచ్చే నెల 15వ తేదీలోగా విద్యుత్ ప్లాంట్లకు విదేశీబొగ్గు రాకపోయినా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని వార్నింగ్ ఇచ్చింది.
దేశీయంగా బొగ్గు సరఫరాను తగ్గించేస్తామని, ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి ప్రతి ఉత్పత్తి కేంద్రం 15 శాతం విదేశీబొగ్గును కొనాల్సిందే అని గట్టిగా చెప్పింది. అంటే ఈనెల 31వ తేదీలోగా ఆర్డర్లు ఇస్తే 10 శాతం మాత్రం విదేశీబొగ్గు వాడితే సరిపోతుంది. అలాకాకపోతే మాత్రం తర్వాత 15 శాతం విదేశీబొగ్గు కొనాల్సిందే. పైగా దేశీయ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు దేశీయంగా దొరికే బొగ్గు సరఫరాను తగ్గించేస్తామని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది.
దేశంలో బొగ్గుకొరతను తీర్చేందుకే థర్మల్ ప్లాంట్లలో ఉపయోగించే బొగ్గులో 10 శాతం విదేశీబొగ్గును వాడితీరాలనే నిబందనను కేంద్రం తీసుకొచ్చింది. విదేశీబొగ్గు నిల్వలను క్రమంగా పెంచుకుంటు పోవాలని కేంద్రం డిసైడ్ చేసింది. అందుకనే విదేశీబొగ్గు కొనుగోలు విషయంలో రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేస్తోంది. ఇందులో భాగంగా దేశంలో ఉన్న 170 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఎంతున్నాయనే విషయమై కేంద్రం ఆరాతీస్తోంది.
మామూలుగా అయితే విద్యుత్ ఉత్పత్తిలో ఎలాంటి అంతరాయాలు రాకుండా ఉండాలంటే ప్రతి ప్లాంటు కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గును నిల్వ ఉంచుకోవాలి. ఇపుడు కేంద్రం చేస్తున్న ఆరా కారణంగా బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నా విదేశీబొగ్గు కొనుగోలు వైపు రాష్ట్రాలను నెట్టేస్తోంది.
అంటే ఒకవైపు బొగ్గు నిల్వలు తగ్గిపోతుంటే దేశీయబొగ్గును సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుకుంటుందన్నమాట. మనకు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఉక్రెయిన్, రష్యా నుండి బొగ్గు దిగుమతవుతుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బొగ్గు సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో మిగిలిన రెండు దేశాలు కూడా బొగ్గు సరఫరాను నిలిపేశాయి. దాంతో బొగ్గు నిల్వలు అయిపోయి కొరత వచ్చేసి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పడిపోయింది.