Begin typing your search above and press return to search.

బ్రేకింగ్‌: 1 నుంచి ఎవ‌రి హైకోర్టు వారిదే

By:  Tupaki Desk   |   26 Dec 2018 2:02 PM GMT
బ్రేకింగ్‌: 1 నుంచి ఎవ‌రి హైకోర్టు వారిదే
X
తెలుగు రాష్ట్రాల సుదీర్ఘ డిమాండ్ ఒక‌టి ఎట్ట‌కేల‌కు సాకార‌మైంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ - తెలంగాణ ఉమ్మ‌డి హైకోర్టును కేంద్ర‌ప్ర‌భుత్వం విభ‌జించింది. ఈ మేర‌కు బుధ‌వారం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం నూత‌న సంవ‌త్స‌రం తొలి రోజు నుంచి ఇరు రాష్ట్రాల హైకోర్టు కార్య‌క‌లాపాలు వేర్వేరుగా ప్రారంభ‌మ‌వ‌నున్నాయి.

వాస్త‌వానికి ఈ గెజిట్ నోటిఫికేష‌న్ గ‌త‌వార‌మే విడుద‌ల కావాల్సింది. అయితే - అన్ని విషయాలపై అధ్యయనం చేసి సంబంధిత శాఖలతో సమాలోచనలు జరిపిన కేంద్ర‌ప్ర‌భుత్వం తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. తెలంగాణకు 10 మంది, ఆంధ్రప్రదేశ్‌ కు 16 మంది న్యాయమూర్తులను కేటాయించింది.

ఏపీకి కేటాయించిన న్యాయమూర్తులు

1) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్
2) జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్
3) జస్టిస్‌ వెంకట నారాయణ
4) జస్టిస్‌ శేషసాయి
5) జస్టిస్‌ శేషాద్రి నాయుడు
6) జస్టిస్‌ సీతారామమూర్తి
7) జస్టిస్‌ దుర్గా ప్రసాద్‌ రావు
8) జస్టిస్‌ సునీల్‌ చౌదరి
9) జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి
10) జస్టిస్‌ శ్యాం ప్రసాద్
11) జస్టిస్‌ ఉమాదేవి
12) జస్టిస్‌ బాలయోగి
13) జస్టిస్‌ తేలప్రోలు రజని
14) జస్టిస్‌ వెంటక సుబ్రహ్మణ్య సూర్యనారాయణ సోమయాజులు
15) జస్టిస్‌ జస్టిస్‌ విజయలక్ష్మి
16) జస్టిస్‌ గంగారావు

తెలంగాణకు కేటాయించిన న్యాయమూర్తులు

1) జస్టిస్‌ వెంకట సంజయ్‌ కుమార్
2) జస్టిస్‌ రామచంద్రరావు
3) జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి
4) జస్టిస్‌ నవీన్‌ రావు
5) జస్టిస్‌ కోదండరామ్‌ చౌదరి
6) జస్టిస్‌ శివశంకర్‌ రావు
7) జస్టిస్‌ షమీన్‌ అక్తర్
8) జస్టిస్‌ కేశవరావు
9) జస్టిస్‌ అభినందన్‌ కుమార్
10) జస్టిస్‌ అమర్‌ నాథ్‌ గౌడ్