Begin typing your search above and press return to search.
‘గోల్డ్’ పంకజ్ కోసం కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
By: Tupaki Desk | 9 Aug 2021 3:25 AM GMTయావత్ దేశం ఇప్పుడు ‘పంకజ్’ నామస్మరణ చేస్తుందంటే ఆశ్చర్యం లేదు. కలలో కూడా ఊహించని గెలుపును అందించిన అతగాడు సాధించిన విజయంతో దేశంలో ఇప్పుడు పండుగ వాతావరణం నెలకొని ఉంది. బంగారు పతకం కోసం అతడు పడిన కష్టం ఎంతన్న విషయాన్ని తెలిసేలా కొన్ని వీడియోలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. దేశానికి సరికొత్త స్ఫూర్తిదాతగా పంకజ్ నిలుస్తున్నారు. భారత అథ్లెటిక్స్ చరిత్రలో సుదీర్ఘమైన వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన క్రీడాకారుడిగా అతడి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దేశ ప్రథమ పౌరుడు మొదలు ప్రధానితో సహా సామాన్యుడి వరకు ఇప్పుడు పంకజ్ ఆటకు ఫిదా అయిపోయినోళ్లే.
మరింత సాధించిన పంకజ్ కోసం భారత ప్రభుత్వం అతడి మీద ఎంత ఖర్చు చేసింది. ఒలింపిక్స్ కు వెళ్లటానికి వీలుగా.. అతను తయారయ్యేందుకు.. అతడి శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందన్న వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ లెక్కను చూస్తే.. అతడి మీద ఖర్చు చేసిన ప్రతి రూపాయికి రూ.కోటి ప్రతిగా ఇచ్చిన వైనం అతడి తాజా గెలుపుతో స్పష్టమవుతుందని చెప్పాలి.
దాదాపు తొమ్మిదేళ్ల క్రితం అంటే.. 2012లో అండర్ 16 జాతీయ చాంపియన్ గా నిలిచిన నీరజ్.. 2015లో జరిగిన జాతీయ జూనియర్ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలిచారు. దీంతో.. అతగాడి పేరు తొలిసారి బయటకు వచ్చింది. తర్వాత వరల్డ్ అండర్ 20 ఛాంపియన్ షిప్ లో జావెలిన్ ను 86.48 మీటర్లు విసిరిన అతను ప్రపంచ రికార్డును నెలకొల్పటం ద్వారా భారత క్రీడాలోకాన్ని తన వైపునకు తిప్పాడు.
తాజాగా ముగిసిన టోక్యో ఒలింపిక్స్ లో నీరజ్ సాధించిన స్వర్ణం వెనుక వ్యక్తిగతంగా అతడు చేసిన శ్రమ ఎంతో ఉందని చెప్పాలి. అతడ్ని ఒలింపిక్స్ కు తయారు చేసేందుకు కేంద్రం భాగానే ఖర్చు చేసినట్లుగా చెబుతారు. దీనికి సంబంధించిన లెక్కలు బయటకు వచ్చాయి. స్పోర్ట్స్ అథారిటీ ఇండియా ప్రకారం.. ఈ ఒలింపిక్స్ కు ముందు 450 రోజుల పాటు నీరజ్ చోప్రా విదేశాల్లో శిక్షణ తీసుకోవటానికి.. పోటీల్లో పాల్గొనటానికి కేంద్రం చేసిన ఖర్చు అక్షరాల రూ.4.85 కోట్లు. మరింత వివరంగా చెప్పాలంటే రూ.4,85,39,638గా చెబుతారు. రెండేళ్ల క్రితం నీరజ్ చేతికి శస్త్రచికిత్స చేసిన తర్వాత అతనికి వ్యక్తిగత కోచ్ గా డాక్టర్ క్లాస్ బార్టోనియెట్జ్ ను నియమించారు. ఇతనికి ప్రభుత్వం రూ.1.22కోట్ల మొత్తాన్ని చెల్లించింది.
నీరజ్ కోసం కొనుగోలు చేసిన నాలుగు జావెలిన్ లకు రూ.4.35 లక్షలు ఖర్చు చేశారు. ఒలిపింక్స్ కు కాస్త ముందుగా అతడు యూరప్ టోర్నీలో పాల్గొనేందుకు 50 రోజుల పాటు స్వీడన్ లో శిక్షణ పొందాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం అతడికి రూ.19,22,533 ఖర్చు చేసింది. తన మీద నమ్మకంతో ప్రభుత్వం ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తన అద్భుతమైన ఆటతో స్వర్ణాన్ని సాధించి అంతకు మించి దేశానికి తిరిగి ఇచ్చేశాడని చెప్పాలి. అతడు సాధించిన స్వర్ణం ముందు.. అందుకోసం పెట్టిన ఖర్చు చిన్నబోవటం ఖాయమని చెప్పాలి.