Begin typing your search above and press return to search.

యాపిల్, గూగుల్ కంపెనీలకు కేంద్రం షాక్.. త్వరలోనే మన ఓఎస్..!

By:  Tupaki Desk   |   25 Jan 2022 11:30 PM GMT
యాపిల్, గూగుల్ కంపెనీలకు కేంద్రం షాక్.. త్వరలోనే మన ఓఎస్..!
X
గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సాంకేతిక రంగంలో భారతదేశం కీలకమైన అభివృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే అనేక ఆవిష్కరణలకు తెర దీసింది. అయితే ఇదే ఉత్సాహంతో మరో ముందడుగు వేయాలి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో ఇప్పటి వరకు మొబైల్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి సొంత ఓఎస్ అేది లేదు. దీంతో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి.. ప్రస్తుతం ఉన్న గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్, యాపిల్ ఐఓఎస్ లకు దీటుగా సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఇప్పటికే ప్రపంచంలో ఉన్న అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువ భాగం గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్ ఓఎస్ ను ఉపయోగిస్తున్నాయి. దీని తర్వాత అదే స్థాయిలో అత్యధికంగా ఉపయోగించేది ఐఓఎస్. ఇది యాపిల్ సంస్థకు చెందింది. అయితే ఐఓఎస్ అనేది కేవలం ఆపిల్ సంస్థ రూపొందించిన స్మార్ట్ ఫోన్ లకు మాత్రమే ఉపయోగిస్తుంది. మరే ఇతర సంస్థ దీనిని ఉపయోగించడానికి యాపిల్ అనుమతించదు. అంతేగాకుండా ఐఓఎస్ వినియోగానికి చాలా ఖర్చు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఎక్కువ భాగం ఆండ్రాయిడ్ ఓఎస్ ను అందించడానికి మొగ్గు చూపుతాయి.

అయితే ప్రపంచంలో ఇప్పటికే చాలా కంపెనీలు కు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ అవి అంతా ప్రాచుర్యంలోకి రాలేదు. ఈ కారణంగానే ఆండ్రాయిడ్ ఓఎస్ ను స్మార్ట్ ఫోన్ లకు అందించేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తాయి. అయితే వీటిని పక్కన బెట్టే విధంగా.. నిజం చెప్పాలంటే వీటిని తలతన్నే విధంగా ఓ ఓఎస్ ను కేంద్రం రూపొందించాలని భావిస్తుంది.

కేంద్రం తీసుకురానున్న కొత్త ఓఎస్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఓఎస్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ముఖ్యంగా మన దేశంలో ఉండే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే మన దేశంలో సగటున ప్రతీ భారతీయుడికి ఓ మొబైల్ ఉంది. ఇంకా స్మార్ట్ ఫోన్లు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త ఓఎస్ ను రూపొందిస్తే మంచి ఆదరణ కూడా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ ఓఎస్ రూపొందించే ప్రాజెక్ట్ ను మేకిన్ ఇండియాలో భాగంగా రూపొందించాలి పలువురు నిపుణులు కేంద్రానికి సూచించినట్లు సమాచారం. ఇదే జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్మార్ట్ ఫోన్ లు అమ్ముడు అయ్యే భారత్ లో గూగుల్, యాపిల్ సంస్థలకు గట్టి దెబ్బతగిలినట్లు అనే నిపుణులు భావిస్తున్నారు.

దీనితో పాటు మరో వాదన కూడా వినిపిస్తుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల మీద కూడా పన్ను మరింత పెంచితే బాగుంటుందని చెప్తున్నారు. ఇలా చేయడం ద్వారా మేకిన్ ఇండియా కార్యక్రమం మరింత పుంజుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. దీనితో పాటే ఇప్పటికే విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి రాయితీలను కూడా పెంచితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేపట్టన మేకిన్ ఇండియా మరో లెవల్ కు వెళ్తుందని చెప్తున్నారు.