Begin typing your search above and press return to search.
ఏపీపై మారుతున్న కేంద్రం వైఖరి.. రీజన్ ఏంటి?
By: Tupaki Desk | 7 Jan 2023 3:30 PM GMTఏపీపై కేంద్రం వైఖరి మారుతోంది. రాజకీయంగా ఏదో తేడా వస్తోంది. నిన్న మొన్నటి వరకు జగన్ సర్కారు కు అండగా ఉన్న కేంద్రం అనూహ్యంగా రూటు మార్చినట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ మార్పునకు రీజనేంటి? ఎందుకు? అనేది ఆసక్తిగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌కు ఇప్పటి వరకు కేంద్రం అండగానే ఉంది. అదేవిధంగా జగన్ కూడా కేంద్రానికి దన్నుగా ఉన్నారు.
పరస్పర సహకారం కలిసి వచ్చింది. కేంద్రంలో తీసుకున్న నిర్ణయాలను తన ఎంపీలతో జగన్ సహకరించా రు. అలాగే.. రాష్ట్రానికి అవసరమైన మేరకు అప్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించడం వంటివి ఇప్పటి వరకు సజావుగానే సాగాయి. ఇక, కేంద్రం ఇస్తున్న నిధులను కూడా వివిధ పథకాలకు వాడుతున్నా రనే వాదన వినిపిస్తున్నా.. కేంద్రం మాత్రం మౌనంగానే ఉంటోంది.
అంటే.. మొత్తంగా ఇరు పక్షాల మధ్య సహకారం.. ఉభయకుశలోపరి అన్నట్టుగానే సాగుతుండడం గమనా ర్హం. అయితే.. ఇక్కడ తాజా విషయానికి వస్తే..ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే.. ఎక్కడో బీజేపీ.. తన దారి తాను చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు అనివార్యమైన నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాన్ని అమలు చేసే క్రమంలోనే వైసీపీకి దూరం పాటిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు తాజాగా అప్పుల విషయంలోనూ కేంద్రం సహకారం తగ్గిపోయింది. 12 వేల కోట్ల రూపాయలు అ ప్పుగా ఇవ్వమని కోరితే.. ఏపీ ఇప్పటి వరకు చేసిన అప్పులు.. ఇతరత్రా వడ్డీలు.. తదితరాలను కలిపి లెక్కలు చూసి.. కేవలం 2 వేల కోట్లకు అనుమతించడం.. ఆర్థిక శాఖలోనేకాదు..రాజకీయ వర్గాల్లోనూ కేంద్రం-రాష్ట్రానికి ఉన్న సంబంధం చీలికలుగా మారుతోందనే సందేహాలు మొదలయ్యాయి. మరి ఇవి ఎన్నికల నాటికి ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.