Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఆర్బీఐ పరిధిలోకి ఇక బ్యాంకులు

By:  Tupaki Desk   |   24 Jun 2020 3:27 PM GMT
బ్రేకింగ్: ఆర్బీఐ పరిధిలోకి ఇక బ్యాంకులు
X
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కాక 30వరకు ఉన్నా చిన్నా చితకా బ్యాంకులన్నింటిని విలీనం చేసి ఇప్పుడు దేశంలో 12 బ్యాంకులనే ఉంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో మన ఎస్.బీ.ఐని ఈ విలీనంతో ఒకటిగా నిలిపింది. ఇక బ్యాంకులకు తద్వారా ఆర్థిన నష్టాల నుంచి ఊపిరిలూదింది. పటిష్టం చేసింది.

ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, మల్టీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకులను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఆర్బీఐ) కిందకు తీసుకువచ్చామని ప్రకటించింది. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ జారీ చేసింది. కేంద్ర కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది.

దీంతో దేశంలోని కోఆపరేటివ్ బ్యాంకులన్నీ కూడా ఇప్పుడు ఆర్బీఐ పరిధిలోకి వచ్చినట్టు కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దేశంలో 1482 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులు.. 58 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ పర్యవేక్షణ ఉంటుంది. తద్వారా ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్లో జరిగే మోసాలకు చెల్లుచీటి పడనుంది. 8.6 కోట్ల మంది డిపాజిటర్లకు బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం పెరగనుంది.

ఇక ముద్ర యోజన రుణాల వడ్డీ రేట్లను మోడీ సర్కార్ రాయితీని ఇచ్చింది. 2శాతం వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్టు ప్రకటించింది. రుణ గ్రహీతలకు ఊరటనిచ్చింది.