Begin typing your search above and press return to search.

నాణ్య‌త లేవు.. చైనా కిట్లు వాడొద్దు: రాష్ట్రాల‌కు ఐసీఎంఆర్ కీల‌క ఆదేశం

By:  Tupaki Desk   |   27 April 2020 11:42 AM GMT
నాణ్య‌త లేవు.. చైనా కిట్లు వాడొద్దు: రాష్ట్రాల‌కు ఐసీఎంఆర్ కీల‌క ఆదేశం
X
అత్యంత చౌక‌గా వ‌స్తువులు అంటే గుర్తిచేది చైనా వ‌స్తువులే. అది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఎంత‌టి బ్రాండ్ ఉన్న వ‌స్తువు ఏదైనా చైనా దానికి డ‌మ్మీ వ‌స్తువు రూపొందించుకుని దాన్ని క్యాష్ చేసుకోవ‌డం చైనాకు అల‌వాటే. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విష‌యంలోనూ అదే జ‌రిగింది. క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌ల‌కు ఉప‌యోగించే కిట్లు కూడా నాణ్య‌మైన‌వ‌ని కాద‌ని భార‌త ప్ర‌భుత్వం తేల్చి చెప్పింది. ఆ దేశానికి చెందిన‌ ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను ఇక నుంచి వాడరాదని రాష్ట్రాలకు ఐసీఎంఆర్‌ ఆదేశాలు జారీ చేసింది.

చైనా ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్స్‌ లో నాణ్యత లేద‌ని, నాణ్య‌త లోపించిన ఆ కిట్ల‌ను వాడొద్ద‌ని ఐసీఎంఆర్ సూచించింది. ఆయా కిట్లను తిరిగి చైనాకు వెనక్కు పంపించాలని రాష్ట్రాలకు తెలిపింది. చైనా వాళ్లు నాణ్య‌త లేని ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను రూపొందించారని, ఆ కిట్లు ఉప‌యోగించ‌రాద‌ని తెల‌ప‌డంతో ఆందోళ‌న మొద‌లైంది. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో చైనాకు సంబంధించిన ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను వినియోగిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ కిట్ల‌ను తిరిగి పంపిస్తే క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌డానికి ప‌రికరాల కొర‌త ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. దీంతో ప‌రీక్ష‌లు చేయ‌డంలో కొంత జాప్య‌మ‌య్యే అవ‌కాశం ఉంది. కేంద్ర ప్ర‌భుత్వం దీనిపై ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో ఎదురుచూడాలి.