Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు 'విమోచన' షాకిచ్చిన కేంద్రం.. ఇక సెప్టెంబర్ 17 అధికారికం
By: Tupaki Desk | 3 Sep 2022 9:30 AM GMTతెలంగాణలో హైదరాబాద్ విలీన దినోత్సవం చేయడానికి గడిచిన ఏనిమిదేళ్లుగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తటపటాయిస్తున్నాడు. ఎంఐఎంతో దోస్తీ ఓ వర్గం ఓట బ్యాంక్ కోసం తెలంగాణ విమోచన జరపడం లేదని బీజేపీ ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కేంద్రమే సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా అధికారికంగా సెప్టెంబర్ 17ను తెలంగాణలో నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసి కేసీఆర్ సర్కార్ కు గట్టి షాక్ ఇచ్చింది.
తెలంగాణలో సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహించాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. తెలంగాణతోపాటు ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రాష్ట్రాల ఇద్దరు సీఎంలను ఆహ్వానిస్తోంది. కర్నాటక సీఎం బసవరాజు, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను కలుపుకొని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడానికి సిద్ధమయ్యారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా హైదరాబాద్ నిజా నవాబుల పాలనలో ఉండడంతో స్వాతంత్ర్యం రాలేదు. కానీ అప్పటి ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ పై దండెత్తి సైనిక చర్య ద్వారా భారత యూనియన్ లో విలీనం చేశారు. గుజరాత్ కే చెందిన పటేల్ ధైర్య సాహసాలను కొనియాడుతూ బీజేపీ సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినాన్ని అధికారికంగా నిర్వహించడానికి రెడీ అయ్యింది.
అయితే హైదరాబాద్ తోపాటు తెలంగాణలో భారీ సంఖ్యలో ఉన్న ముస్లింల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి ఏపీలో, విభజన తర్వాత తెలంగాణలోనూ ప్రభుత్వాలు ఈ విలీన దినోత్సవానికి దూరంగా ఉంటూ వస్తున్నాయి.
అయితే తెలంగాణలో అధికారం కోసం ఆశపడుతున్న బీజేపీ అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాన్ని వినియోగించుకుంటోంది. ఈ క్రమంలోనే విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది.
కేసీఆర్ కు అస్సలు ఇష్టం లేని విలీన దినోత్సవాన్నిహైదరాబాద్ లో నిర్వహిస్తుండడం.. పైగా పక్క రాష్ట్రాల సీఎంలు బసవరాజు, ఏక్ నాథ్ షిండేలను ఆహ్వానిస్తుండడం కేసీఆర్ సర్కార్ కు మింగుడుపడని వ్యవహారంగా మారింది. బీజేపీ తన పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల రాజకీయాలను మరింతగా రగిల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
కేసీఆర్ సర్కార్ విలీన దినోత్సవాన్ని నిర్వహించడం లేదు. ఇక్కడ ఎన్ని ఉద్యమాలు చేసినా పట్టించుకోవడం లేదు. అందుకే దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న బీజేపీ.. కేంద్రం సాయంతో ఈ విలీన దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించడంతోపాటు ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఈ పరిణామం కేసీఆర్ కు షాకింగ్ గా మారింది. కేసీఆర్ సర్కార్ కూడా విలీన దినంపై ఏదో ఒకటి చేయకపోతే ప్రజల్లో పలుచన కావడం గ్యారెంటీ. అందుకే ఈ శనివారం కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అంటోంది.
కేంద్రం హైదరాబాద్ లో నిర్వహించే విముక్తి దినోత్సవానికి కేసీఆర్ హాజరవుతారా? లేదా. అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. కేంద్రం నిర్వహించే ఏ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కావడం లేదు. మోడీ సహా కేంద్రమంత్రులను కలవడం లేదు. ఇప్పుడు దీనికి రావడం కష్టమేనంటున్నారు. చూడాలి మరీ ఏం జరుగుతుందో..?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.