Begin typing your search above and press return to search.
ఎంపీలు చేస్తున్న పనులు తెలిస్తే...బాధపడతాం
By: Tupaki Desk | 27 Dec 2018 7:18 AM GMTమన ఎంపీలకు చెందిన ఆశ్చర్యకర విషయం మరోమారు వెలుగులోకి వచ్చింది. నియోజకవర్గాలకు కేటాయిస్తున్న అభివృద్ధి నిధుల్ని పూర్తిగా వినియోగించుకోవడంలో అత్యధిక మంది ఎంపీలు విఫలమవుతున్నారు. 2014 నుంచి ప్రారంభమైన 16వ లోక్ సభలో మొత్తం 543 మంది ఎంపీలకుగాను కేవలం 35మంది మాత్రమే తమకు కేటాయించిన రూ.25కోట్ల నిధుల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకున్నారని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. ఈ 35మంది ఎంపీల్లో 10 మంది పశ్చిమ బెంగాల్ వారే. మిగిలిన 25మంది ఎంపీలు ఉత్తరప్రదేశ్ - గుజరాత్ - హర్యానా రాష్ర్టాలకు చెందినవారు. కాగా - దక్షిణాది నుంచీ ఏ ఒక్క లోక్ సభ నియోజకవర్గంలోనూ మొత్తం నిధులు వ్యయం కాకపోవడం గమనార్హం. ఎంపీ ల్యాడ్స్ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చు కాకపోవడంతో అవి క్రమంగా పేరుకుపోతున్నాయి.
స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చుచేసేందుకు వీలుగా ఎంపీ లోకల్ ఏరియా డెవలప్ మెంట్ స్కీం (ఎంపీ ల్యాడ్స్) కింద ప్రతీ పార్లమెంట్ సభ్యుడికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. 1993 నుంచీ ఏటా రెండు విడతలుగా ఈ నిధుల్ని కేంద్రం ఆయా ఎంపీలకు విడుదల చేస్తోంది. దీనికింద ఏడాదికి రూ.5కోట్ల చొప్పున ఐదేళ్ల కాలపరిమితిలో రూ.25కోట్ల నిధులను ఒక పార్లమెంటు సభ్యుడు ఖర్చు చేయవచ్చు. ప్రధానంగా స్థానిక అవసరాలు - మౌలిక వసతుల కల్పన కోసం వాటిని వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వ మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. అయితే ఆ నిధులు పూర్తిస్థాయిలో ఖర్చుకావడం లేదు.
2004నాటి 14వ లోక్ సభ నుంచి ఇప్పటివరకు దేశంలో అలా పేరుకు పోయిన ఎంపీ ల్యాడ్స్ నిధులు 12వేల కోట్ల వరకు ఉన్నాయని అంచనా. నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు చూపిన ఎంపీలకు తదుపరి నిధులు విడుదల చేశాం. అయితే చాలాచోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లను జిల్లా యంత్రాంగాలు సమర్పించడంలో జాప్యం జరుగుతున్నది అని కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ ఈ నెల 19న లోక్ సభకు వెల్లడించారు. ఏడాది లోపల ప్రాజెక్టును పూర్తిచేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ను సమర్పించడం సాధ్యంకాదని మాజీ కేంద్రమంత్రి - పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్ అభిప్రాయపడ్డారు. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టే ప్రాజెక్టులకు భూసేకరణ పెద్ద సమస్యగా మారిందని ఆయన అంటున్నారు. ప్రస్తుతం ఏడాదికి రెండు విడతలుగా మంజూరు చేస్తున్న రూ.5కోట్ల నిధుల్ని - ఇకపై ఒకే విడతలో విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈమేరకు ఎంపీ ల్యాడ్స్ నిధుల ఫార్మాట్ ను మార్చాలని యోచిస్తున్నది. నిధుల విడుదలలో అనవసర జాప్యాన్ని నివారించడంతోపాటు - ప్రాజెక్టులను సంబంధిత జిల్లా యంత్రాంగం సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా ఏడాదికి రూ.5కోట్లను ఒకేసారి ఖాతాల్లో జమచేయాలని ప్రభుత్వం భావిస్తోంది.