Begin typing your search above and press return to search.

అత్యుత్సాహం తో టీడీపీ.. జ‌గ‌న్ కు మేలే చేసింది!

By:  Tupaki Desk   |   5 Feb 2020 8:30 AM GMT
అత్యుత్సాహం తో టీడీపీ.. జ‌గ‌న్ కు మేలే చేసింది!
X
ఏపీ మూడు రాజ‌ధానుల అంశం గురించి జ‌గ‌న్ వ్య‌తిరేకుల్లో ఏవైనా ఆశ‌లుంటే.. వాట‌న్నింటి మీదా నీళ్లు చ‌ల్లే ప్ర‌క్రియ‌లో తెలుగుదేశం పార్టీ త‌న‌వంతు పాత్ర పోషించింది. రాజ‌ధాని అంశంపై కేంద్రం జోక్యం చేసుకుంటుందనో, కేంద్రం ఈ విష‌యంలో జ‌గ‌న్ ను నిరోధిస్తుంద‌నో.. ఎవ‌రైనా అనుకుంటూ ఉంటే అలాంటిదేమీ ఉండ‌ద‌ని కేంద్రం చెప్పింది. కేంద్రం ఈ అంశంపై చెప్పింది అన‌డం కంటే, తెలుగుదేశం పార్టీనే చెప్పించింద‌ని అనాలి. జ‌గ‌న్ కు రూట్ క్లియ‌ర్ చేసింది తెలుగుదేశం పార్టీ!

మూడు రాజ‌ధానుల అంశం గురించి కేంద్రానికి స‌మాచారం లేద‌ని, జ‌గ‌న్ ఈ విష‌యంలో కేంద్రం స‌మాచారం ఇవ్వ‌గానే కేంద్రం అడ్డుప‌డేస్తుంద‌ని కొంద‌రు అమ‌రావ‌తి ప్రేమికులు ప్ర‌క‌టించుకున్నారు. ఈ విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ముందున్నారు. ఢిల్లీ వెళ్లి త‌ను అమ‌రావ‌తికి అనుకూలంగా లాబీయింగ్ అన్న‌ట్టుగా బీజేపీ తో చేతులు క‌లిపిన‌ప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఇక సుజ‌నా చౌద‌రి లాంటి వాళ్లు కూడా.. రాజ‌ధాని విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌చ్చారు. ఎవ‌రికి చెప్పాలో వారికి చెబుతానంటూ ఆ మ‌ధ్య ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు చేసిన ప్ర‌క‌ట‌న కూడా ఈ వ్య‌వ‌హారంలో చ‌ర్చ‌నీయాంశంగా నిలిచింది.

అలాంటి మాట‌ల‌న్నీ అమ‌రావ‌తి ప్రేమికుల‌కు, జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌కు ఆశ‌లుగా క‌నిపించాయి. అలా కేంద్రం జోక్యం చేసుకుంటుందంటూ కొంద‌రు ఆశ‌లు పెట్టుకున్నారు. ఆ వ్య‌వ‌హారం అలానే ఉండి ఉంటే.. అదో లెక్క‌! అయితే తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం కొద్దీ ఆ అంశాన్నీ క‌దిలించింది. ఏపీ రాజ‌ధాని వ్య‌వ‌హారం పై లోక్ స‌భ‌లో ప్ర‌శ్న అడిగి.. కేంద్రం స్పందించేలా చేసింది. ఆ స్పంద‌న త‌మ‌కు సంబంధం లేద‌న్న‌ట్టుగా కేంద్రం చెప్పిన‌ట్టుగా ఉంది. దీంతో రాజ‌ధాని అంశంలో కేంద్రం జోక్యం చేసుకోద‌నే క్లారిటీ రానే వ‌చ్చింది.

ఒక‌వేళ ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అత్యుత్సాహం చూప‌కుండా, కామ్ గా ఉండి ఉంటే.. కేంద్రాన్ని బూచిగా చూపే అవ‌కాశం ఉండేది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని లోక్ స‌భ‌లో క‌దిలించి, కేంద్రం స్పందించేలా చేసింది. ఆ స్పంద‌న జ‌గ‌న్ నిర్ణ‌యానికి అనుకూలంగా ఉండ‌టంతో.. మొద‌టికే మోసం వ‌చ్చిన‌ట్టుగా అవుతోంది! తెలుగుదేశం అత్యుత్సాహం ఇలా జ‌గ‌న్ కు మేలు చేస్తోంద‌ని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ ప‌డుతున్నారు.