Begin typing your search above and press return to search.

రాందేవ్ బాబాకు అండమాన్ అప్పగించేస్తారా?

By:  Tupaki Desk   |   29 Nov 2015 7:06 AM GMT
రాందేవ్ బాబాకు అండమాన్ అప్పగించేస్తారా?
X
కేంద్ర ప్రభుత్వం వద్ద మంచి పలుకుబడి సంపాదించుకున్న యోగా గురు బాబా రాందేవ్ కోరితే ఏమైనా ఇచ్చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధపడిపోతోంది. తాజాగా అండమాన్ నికోబార్ - లక్ష దీవుల పరిధిలోని ఏ దీవిని కోరుకున్నా రాందేవ్ బాబాకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సాక్షాత్తు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే ప్రకటించేశారు. ఇంతకీ రాందేవ్ కు - అండమాన్ కు సంబంధమేంటో తెలుసా... అక్కడి దీవుల్లో యోగా సెంటర్ ఏర్పాటు చేసి టూరిజం డెవలప్ మెంట్ కు బాబాగారు హెల్ప్ చేయాలట. కేంద్రం ఆలోచన అది.. అందుకోసం ఆయనకు ఏకంగా ఒక దీవినే సమర్పించుకునేందుకు సిద్ధమవుతోంది.

రాందేవ్ బాబాకు మోడీ ప్రభుత్వం తిరుగులేని ఆఫరిచ్చింది. అండమాన్ నికోబార్ - లక్షదీవుల పరిధిలోని నిన్ క్యూ - మినీ కాయ్ దీవులతోపాటు... ముంబయి సమీపంలోని కన్హోజీ అంగ్రే - కన్యాకుమారి సమీపంలోని మట్టమ్ - ఒరిస్సాలోని పారాదీప్ సమీపంలోని ఫాల్స్ పాయింట్ దీవుల్లో ఏదైనా ఇస్తామని... అక్కడ యోగా కేంద్రం నెలకొల్పి టూరిజం అభివృద్దికి సహకరించాలని కోరుతున్నారు. అక్కడ రిసార్టులు ఏర్పాటు చేసి యోగా క్లాసులు - ధ్యానం - ఆధ్యాత్మిక తరగతులు - బోధనలు నిర్వహించాలని... తద్వారా విదేశీ టూరిస్టులను అట్రాక్టు చేయొచ్చని ప్రభుత్వం అనుకుంటోంది. అయితే... దీనిపై బాబా ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదు. మరోవైపు బాబాకు ఇవ్వగా మిగిలిన దీవుల్లో పర్యాటక అభివృద్ధికి కూడా కేంద్రం ప్లాన్లు వేస్తోంది. బిడ్డింగ్ విధానంలో ప్రయివేటు సంస్థలకు వాటిని అప్పగించి టూరిజం డెవలప్ చేయించాలనుకుంటోంది.