Begin typing your search above and press return to search.
కల్లోల కాశ్మీరానికి కేబీసీతో చెక్!
By: Tupaki Desk | 7 March 2018 4:01 AM GMTఒక గేమ్ షో.. ఒక రాష్ట్ర శాంతిభద్రతల సీన్ మారుస్తుందా? అంటే.. నో చెప్పేస్తారు ఎవరైనా.కానీ.. కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం అందుకు భిన్నంగా కల్లోల కాశ్మీరంలో కొత్త వెలుగులు నింపటానికి.. సరికొత్త వినోదంతో కాశ్మీరీల మనసుల్ని దోచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ద్వారా కాశ్మీర్ లో కొత్త కాంతులు వెలిగించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వినోద కార్యక్రమంతో పాక్ ప్రేరేపిత తీవ్రవాదానికి చెక్ చెప్పటమే కాదు.. కశ్మీర్ లోని కొత్త టాలెంట్ ను తెర మీదకు తీసుకురావటం ద్వారా వారికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చే కార్యక్రమానికి తెర తీసినట్లుగా చెబుతున్నారు.
వినోద కార్యక్రమాల్లో కశ్మీరీలను భాగస్వామ్యం చేయటం ద్వారా వారి మనసుల్ని డైవర్ట్ చేయొచ్చన్న ఆలోచనలో కేంద్రం ఉంది. ఇందులో భాగంగా కశ్మీరీ భాషలో కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని కేంద్ర హోం శాఖ ప్రణాళికల్ని రూపొందిస్తోంది.
గేమ్ షోలు.. టాలెంట్ షోల తర్వారా వినోదాన్ని పండించటంతో పాటు.. భారత్ లోని విభిన్న సంస్కృతుల్ని కశ్మీరీలకు పరిచయం చేయటం చేస్తారు. దూరదర్శన్ కశ్మీర్ ఛానల్ ద్వారా ఈ కొత్త టీవీ షోల నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రం చురుగ్గా పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇప్పుడున్న ఛానల్స్ లో డీడీ కశ్మీర్ నుఎలా చూస్తారు? ఎక్కువ మందికి ఆ ఛానల్ చేరేందుకు డీడీ భారీ ప్లాన్ వేసింది. ఈ ఛానల్ లో కొత్త కొత్త బాలీవుడ్ సినిమాల్ని ప్రసారం చేసేందుకు ప్లాన్ చేసింది. ఇది వర్క్ వుట్ అయి.. ఇప్పుడా ఛానల్ ను ఎక్కువ మంది వీక్షిస్తున్నారు. ఈ సమయంలో కొత్త గేమ్ షోలు.. టాలెంట్ హంట్ తో కశ్మీర్ ప్రజలకు సరికొత్త వినోదాన్ని అందించటం.. వారి మనసుల్ని డైవర్ట్ చేయాలన్న ఆలోచనలో ఉంది. మరి.. ఈ ప్లాన్ ఎంతమేర వర్కవుట్ అవుతుందో కాలమే చెప్పాలి.